ఎన్టీయార్ కి అందని ద్రాక్ష గా మిగిలిపోతున్న ఆ రికార్డ్ ప్రశాంత్ నీల్ అయిన అందిస్తాడా..?
TeluguStop.com
జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా( Devara Movie )తో మంచి విజయాన్ని అందుకున్నాడు.
ప్రస్తుతం ఆయన వార్ 2 సినిమాని చేస్తున్నాడు.ఇక ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఆయన తొందర్లోనే ఈ సినిమాని ఫినిష్ చేసి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయబోతున్న డ్రాగన్ సినిమా(Dragon Movie ) మీద తన పూర్తి ఫోకస్ ని పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా ద్వారా ఆయన తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా పాన్ ఇండియాలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతల గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్(Junior NTR ) ఎవ్వరికి అందని రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. """/" /
ఆయన కెపాసిటీ కి సరిపడే సినిమా అయితే పడడం లేదు.
అందువల్లే ఆయనకి ఇప్పటివరకు ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా దక్కలేదు.నిజానికి ఆయన లాంటి నటన చాతుర్యం ఉన్నవాళ్ళకి మంచి స్టోరీ తో సినిమా పడితే భారీ విజయాన్ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి ఎందుకు ఆయన దగ్గరికి భారీ సక్సెస్ ను అందించే కథలు రావడం లేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
"""/" /
ఇక ఏదిఏమైనా కూడా ఎన్టీఆర్ లాంటి సింగల్ టేక్ ఆర్టిస్ట్ తో పోటీ పడటమంటే అంత ఆషామాషీ కాదు.
అయినప్పటికీ తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ పైనే పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నాడు.మరి ప్రశాంత్ నీల్ అతనికి ఇండస్ట్రీ హిట్ అందిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే ప్రశాంత్ నీల్ తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా చాలా వరకు హెల్ప్ అవుతుంది.