ఆ అరుదైన ఘనతను స్టార్ హీరో ప్రభాస్ సాధిస్తారా.. ది రాజాసాబ్ తో కల నెరవేరుతుందా?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్(Prabhas) ఈ మధ్య కాలంలో హ్యాట్రిక్ సాధించిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి.

వరుసగా రెండు సినిమాలు సక్సెస్ అవుతున్నా మూడో సినిమాతో హిట్ సాధించడంలో ప్రభాస్ ఫెయిలవుతున్నారు.

బాహుబలి, బాహుబలి2(Bahubali, Bahubali 2) సినిమాలతో గతంలో సక్సెస్ సాధించిన ప్రభాస్ సాహో (Prabhas Saaho)సినిమాతో నిరాశపరిచారు.

సలార్, కల్కి (Salar, Kalki)సినిమాలతో సక్సెస్ సాధించిన ప్రభాస్ తర్వాత సినిమాతో కూడా మ్యాజిక్ రిపీట్ చేయాల్సి ఉంది.

ది రాజాసాబ్ సినిమా నుంచి క్రిస్మస్ కానుకగా టీజర్ విడుదల కానుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ప్రభాస్ కు సంబంధించిన చాలా సన్నివేశాల షూట్ పూర్తి చేయాల్సి ఉందని తెలుస్తోంది.

ది రాజాసాబ్(The Rajasaab) మూవీ థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో కామెడీకి, హర్రర్ కు సమ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. """/" / ది రాజాసాబ్ సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 300 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.

పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం ఈ సినిమా విడుదల కానుంది.

ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

"""/" / ప్రభాస్ సైతం సినిమా సినిమాకు భిన్నమైన జానర్లకు ప్రాధాన్యత ఇస్తుండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న ప్రభాస్ తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో ఎన్టీయార్ మార్కెట్ ను పెంచుతాడా..?