ఏపీలో పవన్ ఇమేజ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ అభిమానుల్లో ఆయన పట్ల క్రేజ్ గురించి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.

అయితే రాజకీయాల్లో పవన్‌కు ఆ క్రేజ్ ఉందా అని ప్రశ్నిస్తే మాత్రం ఆలోచించాల్సిందే.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సినిమాల క్రేజ్‌ను చూసి ఆయన పార్టీకి 10 లేదా 20 సీట్లు వరకు వస్తాయని రాజకీయ పండితులు అంచనా వేశారు.

తీరా ఎన్నికల్లో ఆ పార్టీ బొక్కా బోర్లా పడిన సంగతి అందరికీ తెలిసిందే.

చివరకు రెండు చోట్ల పోటీ చేస్తే పవన్ ఎక్కడా గెలవలేకపోయారు.అయితే మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్న క్రమంలో ఏపీలో గతంతో పోలిస్తే పవన్ కళ్యాణ్‌కు రాజకీయపరంగా క్రేజ్ పెరిగిందా లేదా తగ్గిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎందుకంటే పవన్ ఆచితూచి రాజకీయపరంగా అడుగులు వేస్తున్నారు.ఏపీ రాజకీయాల్లో పవన్ స్థానం సపరేట్‌గా కనిపిస్తోంది.

ఆయనేం మాట్లాడినా ప్రజలను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో కాకుండా ప్రజల బాగు కోరేందుకు పడే తపన కనిపిస్తుంది.

ఆనాడు ఉద్దానం కిడ్నీ సమస్య మొదలుకుని ఇప్పుడు కౌలు రైతుల సమస్యల వరకు పవన్ తనదైన శైలిలో ప్రజలకు ఏదో చేయాలనే తపనతోనే రాజకీయాల్లో ముందడుగులు వేస్తున్నారు.

ఏపీ రాజధానిపై కూడా బాధిత వర్గాలకు పవన్ అండగా నిలిచిన సందర్భాలున్నాయి.టీడీపీ అధికారంలో ఉన్నా.

వైసీపీ అధికారంలో ఉన్నా పవన్ కళ్యాణ్ ఏదో క్రేజ్ తెచ్చుకోవాలని ప్రజల్లోకి వెళ్లలేదు.

తాను ఏం చేయాలనుకున్నారో అదే చేశారు.అయితే పవన్ ఎన్ని చేసినా ప్రజలు ఏం అనుకుంటున్నారో అన్న సంగతి కూడా ముఖ్యమే.

"""/" / ఎందుకంటే రాజకీయాల్లో అభిమానం ఉంటే సరిపోదు.ఆ అభిమానానికి సరిపడా ఓట్లు కూడా రాలాలి.

మరి ఆ ఓట్లు రాలాలంటే ప్రత్యేక వ్యూహాలతో ముందుకు పోవాలి.కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల పవన్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

పవన్‌ కళ్యాణ్‌లో మైనస్ ఏంటంటే ఆయన ఓ ఇష్యూ పట్టుకుని రైజ్ చేసి మధ్యలోనే వదిలేస్తారు.

ఉద్ధానం సమస్య అయినా రాజధాని సమస్య అయినా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదంటే పవన్ కాడిని మధ్యలో వదిలేయడమే కారణమని పలువురు విమర్శి్స్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం అనధికారికంగా ఖరారు అయినట్లే కాబట్టి రాజకీయంగా క్రేజ్ పెంచుకోవడంపై పవన్ దృష్టి సారిస్తే బాగుంటుంది.

టీడీపీ సహాయంతో ప్రజా సమస్యలపై లోతుగా పోరాటం చేస్తే జనాల్లో పవన్‌కు ఆదరణ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన తరఫున పోటీ చేసే వారిని గెలిపించుకుంటే పవన్ సత్తా ఏ పాటితో వచ్చే ఎన్నికల్లో తెలిసిపోతుంది.

అప్పుడు తెలుస్తుంది పవన్‌కు రాజకీయాల్లో ఎంత క్రేజ్ ఉందో.? .

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన డాక్టర్ బాబు.. ఘనంగా గృహప్రవేశ వేడుకలు!