పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేవలం బీమ్లా నాయక్‌కు మాత్రమే డేట్స్ ఇచ్చి పొలిటికల్‌ బిజీ అవుతారని అందరూ అనుకున్నారు.

కానీ ముందుగా మాట ఇచ్చిన ప్రకారం, మళ్లీ క్యూలోకి వచ్చి సెట్స్‌లో షూటింగ్ ఫినిష్ చేస్తానంటున్నట్టు సమాచారం.

పవన్‌కు ఇప్పుడున్న కమిట్‌మెంట్స్‌కు ఇన్‌టైమ్ షూటింగ్స్ అవుతాయో లేదో వేచి చూడాలి మరి.

పవన్‌ కల్యాణ్‌.అనుకోకుండా వచ్చి పడుతున్న పనులతో అనుకున్న ప్రకారం సినిమా షూటింగ్‌లను పూర్తి చేయలేకపోతున్నట్టు సమాచారం.

ఇకపోతే పొలిటికల్‌ పరంగానూ ఆయన చాలా బిజీగా మారండంతో సినిమాలను ఇన్‌టైంలో పూర్తి చేయలేకపోతున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ముందుగా ఇచ్చిన డేట్స్ ప్రకారం తను ఇచ్చిన సినిమాలు అన్నింటిని పూర్తి చేస్తారా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

పవన్‌ కల్యాణ్ హరిహర వీరమల్లు షూట్ లేటవుతుందని తెలిసే ముందుగా బీమ్లా నాయక్‌ను పూర్తి చేయడానికి సన్నద్ధం అయ్యారని విశ్వసనీయ వర్గాస సమాచారం.

"""/"/ ఇకపోతే బీమ్లా నాయక్ నవంబర్ సెకండ్‌ వీక్‌లోపు అయిపోతే ఆ వెంటనే హరిహర మల్లుకు డేట్స్ సెట్ చేద్దామనుకున్నారు.

కాగా ఇప్పటికే ఈ సినిమా 60శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.మిగతాది బ్యాలెన్స్‌గా మిగిలిపోయింది.

అన్నీ కుదిరితే అక్టోబర్‌లోనే ఈ షూట్ ప్రారంభం కావాలి.కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది జరగనట్టే తెలుస్తోంది.

కాగా అది డిసెంబర్‌ నెల నుంచి స్టార్ట్‌ అవుతుందని పలువురి వాదన. """/"/ నిజానికి హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ 50శాతం పూర్తి అయ్యాక కరోనా కారణంగా షూటింగ్ ఆపుకోవాల్సి వచ్చింది.

ఆ సమయంలోనే పవన్‌ కల్యాణ్‌ కూడా కరోనా బారిన పడడంతో అదీ ఒక కారణమైందని చెప్పవచ్చు.

ఆ సమయంలోనే పవన్ బీమ్లా నాయక్ షూటింగ్‌పైనే పూర్తి దృష్టి పెట్టారని సమాచారం.

వీరమల్లుతో పోలిస్తే ఇది చిన్న సినిమానే గనక ఈ సినిమాను పూర్తి చేసిన తరువాతే వెళ్దామని పవన్ అనుకున్నారు.

అన్నీ కుదిరితే ఈ నెల 25వ తేదీ నుంచి వీరమల్లు తాజా షూటింగ్‌ను మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాను ఈ సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎ.ఎం.

రత్నం చూస్తున్నట్టు తెలుస్తోంది.అయితే అప్పటిలోగా ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉంటే అది జరుగుతుంది.

లేదంటే అపుడు కూడా మరింత లేటుగా, లేటెస్ట్‌గా వస్తుందేమో తెలియాల్సి ఉంది.

ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్.. ఓజీ సినిమాపై థమన్ అంచనాలు పెంచేస్తున్నారా?