ఈ ఆడబిడ్డకు పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారా.. రాజ్ తరుణ్ విషయంలో పవన్ ఏం చేస్తారో

సినీ నటుడు రాజ్ తరుణ్( Raj Tarun ) పెద్ద వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే.

లావణ్య( Lavanya ) అనే యువతీతో 11 సంవత్సరాలు పాటు రిలేషన్ లో ఉండడమే కాకుండా తనని పెళ్లి చేసుకున్నారని అయితే ఇప్పుడు తనని మోసం చేశారంటూ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.

ఎలాగైనా నాకు తనకు రాజ్ తరుణ్ కావాలి అంటూ ఈమె పోలీస్ కేసు పెట్టడమే కాకుండా తనకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు.

అయితే ఈ పోరాటంలో భాగంగా సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( AP Deputy CM Pawan Kalyan )ను కలిసి న్యాయం కోసం పోరాటం చేస్తానని వెల్లడించారు.

"""/" / పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అలాగే మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకుంటూ రాజకీయాల పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే లావణ్య పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానినని తెలిపారు.

పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైన మొదటి రోజు మొదటి షో చూస్తాను అలాగే నా కారు వెనుక పవన్ కళ్యాణ్ స్టిక్కర్ తప్పనిసరిగా ఉంటుంది.

పవన్ కళ్యాణ్ అంటే నాకు అంత అభిమానం అందుకే న్యాయం కోసం నేను ఆయన వద్దకే వెళ్తానని తెలిపారు.

"""/" / ఇలా న్యాయం కోసం పవన్ కళ్యాణ్ ని కలుస్తానని చెప్పిన లావణ్య పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.ఇక తన ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చినప్పటికీ వారితో ఈయన కలిసినప్పుడు వారికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా చూసుకున్నారు .

కానీ రాజ్ తరుణ్ అలా కాదు, కనీసం నేను భోజనం చేయడానికి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు అంటూ ఆరోపణలు చేశారు.

మరి అన్యాయం జరిగిన లావణ్య కు పవన్ కళ్యాణ్ తన స్టామినా ఉపయోగించి న్యాయం చేస్తారా, రాజ్ తరుణ్ విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది.

వయనాడ్ విషాదం.. భారీ మొత్తంలో విరాళాలను ప్రకటించిన సెలబ్రిటీల జాబితా ఇదే!