పవన్ పోరాటాలు బీజేపీతోనా ఒంటరిగానా ? 

మొత్తానికి రాజకీయ రణరంగంలో మళ్లీ యాక్టివ్ కావాలని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ డిసిషన్ తీసేసుకున్నారు.

సనిమాలలో బిజీగా ఉన్నా, రాజకీయాల వైపు దృష్టి సాధించకపోతే జనసేన పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది అనే విషయాన్ని పవన్ గుర్తించారు.

అందుకే సినిమా షెడ్యూల్ సైతం పక్కనపెట్టి క్షేత్రస్థాయిలో జనసేన తరపున పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు.

నేడు, రేపు పవన్ పార్టీ నాయకులతో సమావేశం అవుతున్నారు.ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.

ఇంత వరకు బాగానే ఉన్నా జనసేన మిత్రపక్షంగా ఉన్న బీజేపీని కలుపుకు వెళ్లే విధంగా పోరాట కార్యక్రమాలు రూపొందించాలా లేక ఒంటరిగానే జనసేన వైసిపి ప్రభుత్వంపై పోరాటం చేయాలా అనే విషయంలో క్లారిటీ లేదు.

 ఇటీవల బీజేపీ ఆస్తిపన్ను పెంపుపై ఏపీలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది.అయితే దానికి జనసేన కు ఆహ్వానం అందకపోవడం పై పెద్ద చర్చే నడిచింది.

అయితే ఆ విషయం పవన్ మనసులో పెట్టుకుని బీజేపీని పక్కకు పెడతారనే ప్రచారం జరుగుతోంది.

బీజేపీ జనసేన ను దెబ్బతీసేందుకు ఒక పథకం ప్రకారం ముందుకు వెళుతుందనే అనుమానాలు పవన్ లో ఉన్నాయి.

కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ వంటి పార్టీల అండ లేకపోతే రాజకీయంగా దెబ్బ తింటాము అనే విషయం పవన్ కు బాగా తెలుసు.

అందుకే అంటీ ముట్టనట్లుగానే బీజేపీతో వ్యవహారాలు చేస్తున్నారు.ఈరోజు రేపు విజయవాడలో పార్టీ నాయకులతో సమావేశమవుతున్న పవన్ ఏపీలో నెలకొన్న సమస్యలు, వైసీపీ ప్రభుత్వ విధానాల పై ఏవిధంగా పోరాడాలి ? ఎప్పుడెప్పుడు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంపై పార్టీ నేతలతో క్షుణ్ణంగా చర్చించబోతున్నారు.

  """/"/ అయితే ఇందులో బీజేపీ ని కలుపుకు వెళ్లే అవకాశం లేనట్టుగా జనసేన వైఖరి కనిపిస్తోంది.

అది కాకుండా బీజేపీ తీరుపై జనసేన కేడర్ లో తీవ్ర అసంతృప్తి ఉంది.

మిత్రపక్షంగా ఉన్న తమను గుర్తించడం లేదని బాధ జనసేన వర్గాల్లో ఉండడం తో బీజేపీ తో కలిసి పోరాటం అనే విషయాన్ని పక్కన పెట్టి ఒంటరిగానే జనసేన ముందుకు వెళ్లేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అదే జరిగితే రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

సీఎం జగన్ రేపటి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్..!!