వచ్చేనెలనుండి యూట్యూబ్ లో “ఓవర్‌లే యాడ్స్” ఇంకా కనపడవట?

ఈ ప్రపంచంలో స్మార్ట్ ఫోన్స్ కి కొదువ లేదు.స్మార్ట్ ఫోన్ అనేది నేటి దైనందిత జీవితంలో తప్పనిసరి అయిపోయింది కాబట్టి, ఇక్కడ ప్రతి ఒక్కరూ దానిని వినియోగిస్తున్నారు.

చిన్న పిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు దానికి బాగా అలవాటు పడ్డారు అని చెప్పుకోవచ్చు.

ఇక తాజా సర్వేలో తేలింది ఏమంటే.ప్రముఖ సోషల్ మీడియా అయినటువంటి యూట్యూబ్ ని వందలో 99 మంది పొద్దున్న లేవగానే ఓపెన్ చేస్తున్నారని తేలింది.

దాన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు.యూట్యూబ్ వినియోగం ఏ మాదిరి ఉంటుందో అని.

"""/" / ఇక తాజాగా యూట్యూబ్ యాడ్ లకు సంబంధించి కొత్త న్యూస్ ఒకదానిని ప్రకటించింది.

దీని ప్రకారం రాబోయే నెల ఏప్రిల్ 6 నుండి యూట్యూబ్ కంటెంట్ నుండి "ఓవర్‌లే యాడ్స్"ను తీసివేస్తున్నట్లు ప్రకటించింది.

అంటే ఇక్కడ ఇకనుండి ప్రకటనలు చూపబడే విధానాన్ని మారుస్తున్నట్లు తెలుస్తోంది."ఏప్రిల్ 6, 2023 నుండి, వీక్షకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు డెస్క్‌టాప్ మరియు మొబైల్ పరికరాలలో అధిక పనితీరు గల ప్రకటన ఫార్మాట్‌లకు మార్చడంలో సహాయపడటానికి 'ఓవర్‌లే యాడ్స్' ను తొలగిస్తున్నట్లు" కంపెనీ యూట్యూబ్ ఫోరమ్‌లో తెలిపింది.

"""/" / ఓవర్‌లే యాడ్‌లు అంటే బేసిగ్గా డెస్క్‌టాప్‌లలో మాత్రమే కనిపించే లెగసీ యాడ్ ఫార్మాట్ ను కలిగి వున్న యాడ్స్ అని చెప్పుకోవచ్చు.

ఇవి వీడియోలు చూసేవారికి ఎక్కువగా అంతరాయం కలిగిస్తాయి.ఇకనుండి ఈ ప్రకటనలు డెస్క్‌టాప్‌లో మాత్రమే కనిపిస్తాయని, మొబైల్ లో కనిపించవు అని చెప్పుకొచ్చారు.

అయితే చాలా మంది క్రియేటర్‌లకు దీనిపై కాస్త ప్రభావం పడుతుందని కూడా కంపెనీ తెలిపింది.

అంతేకాకుండా, ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ తమ ఇతర ప్రకటన ఫార్మాట్‌లలో ఎలాంటి మార్పులు లేవని కూడా పేర్కొంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు .. రెండుగా చీలిన ఇండియన్ కమ్యూనిటీ , ఆఖరిలో ట్విస్ట్ తప్పదా?