ఈ ఇయర్ లో మన స్టార్ హీరోలు సూపర్ సక్సెస్ లను అందుకుంటారా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్న నేపధ్యం లో ఇప్పుడు రాబోతున్న సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచే సినిమాలుగా మిగిలాలి తప్ప ప్లాప్ లుగా మారే సినిమాలు రాకూడదు అంటూ మన ప్రేక్షకులు సైతం మన హీరోలు చేసే సినిమాల మీద చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఇప్పుడు ప్రతి స్టార్ హీరో కూడా స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ గొప్ప కాంబినేషన్ ను అయితే సెట్ చేసుకున్నారు.
"""/" /
మరి 2025వ సంవత్సరంలో రామ్ చరణ్ బుచ్చిబాబు( Ram Charan Buchibabu ) కాంబోలో వస్తున్న సినిమా రిలీజ్ కాబోతుంది.
కాబట్టి ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించి రామ్ చరణ్ మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు.
దాంతో పాటుగా ప్రభాస్( Prabhas ) హీరోగా వస్తున్న రాజా సాబ్, ఫౌజీ రెండు సినిమాలను కూడా ఇయర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
మరి ఈ సినిమాలు కనక సూపర్ సక్సెస్ అయితే ప్రభాస్ మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న వాడవుతాడు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా హరిహర వీరమల్లు, ఓ జి లాంటి రెండు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేయబోతున్నాడు.
"""/" /
ఇక జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబులు ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చు.
ఎందుకంటే వాళ్లు ఇంకా కొత్త సినిమాని స్టార్ట్ చేయలేదు.సినిమా స్టార్ట్ అయి పూర్తయ్యే సరికి దాదాపు సంవత్సరం నుంచి సంవత్సరన్నర వరకు సమయం పట్టే అవకాశం ఉంది.
తద్వారా ఈ సంవత్సరం వాళ్ళు థియేటర్లోకి వచ్చే అవకాశాలైతే లేవు.మరి ఇప్పుడు వస్తున్న స్టార్ హీరోలు వరుసగా సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది.
చూడాలి మరి వీళ్లలో ఏ హీరో సక్సెస్ సాధిస్తాడు అనేది.
కొండపైకి ఎక్కుతూ జారిన మహిళ.. చివరకు? (వీడియో)