టీడీపీతో కలిస్తే ఎన్టీఆర్ కే నష్టమా ?
TeluguStop.com
తెలుగుదేశం పార్టీకి( TDP Party ) సంబంధించి జూ.ఎన్టీఆర్( Jr NTR ) చుట్టూ తరచూ ఏదో ఒక వివాదం చుట్టూ ముడుతూనే ఉంటుంది.
2009 ఎన్నికల ప్రచారంలో టీడీపీ తరుపున ప్రచారం చేసిన ఎన్టీఆర్ ఆ తరువాత పార్టీకి దూరమయ్యారు.
అప్పటి నుంచి టీడీపీ గురించి గాని టీడీపీకి సంబంధించిన ఏ రకమైన కార్యక్రమాలకు గాని ఎన్టీఆర్ హాజరు కాలేదు.
దాంతో చంద్రబాబు ( Chandrababu Naidu )ఉద్దేశ్య పూర్వకంగానే జూ.ఎన్టీఆర్ ను దూరం చేశారనే విమర్శలు గట్టిగా వినిపించాయి.
ఇదిలా ఉంచితే గత ఎన్నికల తరువాత టీడీపీ పూర్తిగా డీలా పడిపోవడంతో జూ.
ఎన్టీఆర్ పార్టీలోకి వస్తేనే మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని జూ.ఎన్టీఆర్ ను ఆహ్వానించాలని స్వయంగా టీడీపీ శ్రేణులే పలు మార్లు బహిరంగ వ్యాఖ్యలు చేసి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
"""/" /
కానీ చంద్రబాబు మాత్రం ఆ విషయంలో మౌనం వహిస్తూనే వచ్చారు.
ఇదిలా ఉంచితే సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) శతదినోత్సవ ఉత్సవాలను చంద్రబాబు ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే కార్యక్రమంకి ఆ మద్య రజినీకాంత్( Rajinikanth ).ఇక ఇటీవల విక్టరీ వెంకటేష్, రాంచరణ్ వంటి వాళ్ళు కూడా హాజరయ్యారు.
అయితే జూ.ఎన్టీఆర్ హాజరు కాకపోవడంతో దీనిపై రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.
కాగా ఎన్టీఆర్ కు స్వయంగా టీడీపీ శ్రేణులే ఆహ్వానం పలికారు.కానీ తారక్ తన పుట్టినరోజు వేడుకలకు హాజరు కావాల్సి ఉందని చెప్పి టీడీపీ శ్రేణుల ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
దీనిపై తాజాగా టీడీపీ నేత, ఉత్సవ కమిటీ చైర్మెన్ టిడి జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ " ఎన్టీఆర్ శతదినోత్సవ ఉత్సవాలకు హాజరు కావాలని తాము రిక్వెస్ట్ చేస్తే.
ఆల్రెడీ బర్త్ డే ప్రోగ్రాం ఫిక్స్ చేసుకోవడం వల్ల కుదరదని " తారక్ చెప్పినట్లు టిడి జనార్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
బర్త్ డే ఎప్పుడైనా చేసుకోవచ్చని అన్నగారి శతజయంతి ఒక్కసారే వస్తుందని చెప్పినప్పటికి తారక్ రావడం కుదరదని తెగేసి చెప్పినట్లు ఆయన వ్యాఖ్యామించారు.
"""/" /
దీంతో ఎన్టీఆర్ ఉద్దేశ్య పూర్వకంగానే తాతగారి శతజయంతి ఉత్సవాలకు దూరంగా ఉన్నాడనే వాదన వినిపిస్తోంది.
ఒకవేళ తారక్ ఉత్సవాలకు హాజరు అయింటే టీడీపీలో సరికొత్త చర్చ మొదలయ్యేదని, తారక్ ఎలాంటి వ్యాఖ్యలు చేసిన అవి రాజకీయ వివాదానికి తెరతీసె అవకాశం ఉందని భావించే తారక్ దూరంగా ఉన్నాడనేది కొందరి వాదన.
కాగా ప్రస్తుతం తారక్ నేషనల్ స్టార్ గా ఎదుగుతున్నాడు.ఈ నేపథ్యంలో పోలిటికల్ గా ఏ చిన్న వివాదం జరిగిన అది తారక్ కెరియర్ పై ప్రభావం చూపే అవకాశం ఉందనేది మరికొందరి వాదన.
మొత్తానికి అన్నగారి శతజయంతి ఉత్సవాలకు తారక్ హాజరు కాకపోవడం హాట్ టాపిక్ అయినప్పటికి ఒకవేళ హాజరు అయింటే అది మరింత హాట్ టాపిక్ అయి ఉండేదని చెప్పక తప్పదు.
యోగి ఆదిత్యనాథ్‌ను ఆకట్టుకున్న ఇటాలియన్ మహిళలు.. ఏం చేశారో చూడండి!