వైసీపీని న‌వ‌ర‌త్నాలు గ‌ట్టెక్కిస్తాయా.. జ‌గ‌న్ త‌ర్వాతి ప్లాన్ ఇదేనా..?

ఆంధ్రరాష్ట్రమంతా ఎక్కడ చూసినా ఇప్పుడిదే చర్చ నడుస్తోంది.వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని నవరత్నాలు గట్టెక్కిస్తాయా? అని చాలా మంది గుసగుసలు పెట్టుకుంట్టున్నారు.

నవరత్నాలను వైసీపీ ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందే ప్రకటించింది.ఈ నవరత్నాలే తర్వాతి ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని తిరిగి మరలా అధికారంలోకి తెస్తాయని చాలా మంది వైసీపీ నేతలు భావిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా కానీ ఇక్కడ మనం అంగీకరించాల్సిన విషయం ఏమిటంటే.

కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఏ ప్రభుత్వాన్ని గట్టెక్కించలేవు.అందుకోసమే వైసీపీ ఇప్పుడు తన రామ బాణం నవరత్నాల వైపు చూస్తోంది.

టీడీపీ మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో తప్పకుండా పొత్తు పెట్టుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇలా జరిగితే వైసీపీ 2024 ఎన్నికల్లో బారీ మెజారిటీ సాధించడం చాలా కష్టం.

మెజారిటీ విషయం పక్కన పెడితే అసలు వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందా లేదా అనే అనుమానాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలల్లో గెలవడం అంటే అంత తేలిక కాదు.అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్ష నాయకులను ఏమైనా అనడం చాలా తేలికే కానీ అధికారంలోకి రావడం మాత్రం చాలా కష్టం.

ఇప్పటికే ఉన్న ప్రభుత్వ నెగిటివిటీని దూరం చేసుకుని తిరిగి అధికారంలోకి రావడం చాలా ప్రయాసతో కూడుకున్నది.

మరలా ప్రజలను మెప్పించడం చాలా కష్టం.ప్రభుత్వం చేస్తామన్న పనులను సరిగ్గా చేసిందా? లేదా అని ప్రజలు పోల్చి చూసుకుంటారు.

మరో పక్క ప్రతి పక్షం కూడా చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది.ఈ నేపథ్యంలో వైసీపీ కి ఎన్నికల్లో గెలవడం సవాలుతో కూడుకున్నదనే చెప్పాలి.

2024లో తిరిగి అధికారం దక్కించుకోవడం కోసం వైసీపీ నేతలు చాలా కష్టపడాల్సి వస్తుంది.

Kadiyam Srihari : రేపు కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి