‘సరిపోదా శనివారం ‘ సక్సెస్ అయితే నాని స్టార్ హీరో అవుతాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.
ఇలాంటి క్రమంలోనే చాలామంది నటులు ఇండస్ట్రీలో రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన నటులు కూడా వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఇక అందులో భాగంగానే కొంతమంది రాణిస్తుంటే మరి కొంతమంది మాత్రం ఫ్లాపుల బాట పట్టి ముందుకు సాగలేకపోతున్నారు.
మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది.
"""/" /
ఇక రీసెంట్ గా ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోలను మినహాయిస్తే మీడియం రేంజ్ హీరోలుగా కొనసాగుతున్న నాని, నిఖిల్, నితిన్ లాంటి హీరోలు వందల కోట్ల కలెక్షన్లను కొల్లగొడుతూ భారీ రెమినేషన్ ను అందుకుంటున్నారు.
మరి వీళ్లు కనుక ఇకమీదట భారీ సక్సెస్ లను అందుకున్నట్లయితే స్టార్ హీరోలుగా కొనసాగే అవకాశాలైతే ఉన్నాయి.
నిఖిల్( Nikhil Siddhartha ) ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 25 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఆయన స్టార్ హీరోగా మాత్రం తన గుర్తింపును కొనసాగించలేకపోతున్నాడు కారణం ఏంటి అంటే ఆయన సినిమాలు ఒకటి సక్సెస్ అయితే ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.
ఇక సక్సెస్ లో కన్సిస్టెన్సీ ఉంటేనే ఇక్కడ రాణించగలరు. """/" /
నాని ( Nani )వందల కోట్ల కలెక్షన్లను కొల్లగొడుతూ ముందుకు సాగుతున్నాడు.
ఇప్పటికే ఆయన చేసిన దసరా ఆయన సినిమాలతో వందల కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఆయన మరోసారి సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందాలని చూస్తున్నాడు.
ఇక నిజానికైతే ఇప్పుడు 'సరిపోదా శనివారం ' సినిమాతో ఒక మంచి సక్సెస్ ని సాధిస్తుందంటూ పలువురు సినీ మేధావులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
చూడాలి మరి ఈ సినిమాతో నాని ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు.
బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా కుర్రాడిపై కాలు దువ్విన కోహ్లీ.. (వీడియో)