Naga Chaitanya : తెలుగు, తమిళంలో తీసిన సినిమాలన్నీ ఫ్లాప్.. మరి చైతన్య అయినా సక్సెస్ సాధిస్తాడా?

టాలీవుడ్ హీరో నాగచైతన్య( Naga Chaitanya ) నటించిన తాజా చిత్రం కస్టడీ( Custody ).

ఈ సినిమాలో చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా మే 12వ తేదీన విడుదల కానుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఈ సినిమా తెలుగు తమిళం రెండు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న విషయం తెలిసిందే.

కాగా తమిళ దర్శకుడు వెంకట ప్రభు( Venkata Prabhu ).దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో హీరోయిన్ ప్రియమణి నటించింది.

దర్శకుడు వెంకట ప్రభు కీ తెలుగులో ఇదే మొదటి సినిమా. """/" / కాగా నాగచైతన్య తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి సినిమాలు చేయడం అన్నది ఇదే మొదటిసారి కాదు.

గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి ప్రయోగం చేశారు.చైతన్యతో పాటు ఇతర హీరోలు కూడా ఇలా ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో సినిమాలను విడుదల చేశారు.

కానీ అలా ట్రై చేసినా అందరూ హీరోలు కూడా ఫ్లాప్ అయ్యారు.దానితో అందరూ బై లింగ్విల్ చెయ్యడం మానేసి ఒక్క తెలుగులోనే చెయ్యడం మొదలెట్టారు.

రామ్ పోతినేని( Ram Pothineni ) ఇటీవల నటించిన ది వారియర్ అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో నటించగా ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

"""/" / ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

హీరో మహేష్ బాబు( Mahesh Babu ) నటించిన స్పైడర్( Spyder ) సినిమా కూడా తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచింది.

అయితే తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తీయడం అంత ఈజీ విషయం కాదు.

ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు తమిళ ప్రేక్షకులకు నచ్చే అంశాల్లో చాలా వ్యత్యాసం ఉంది.

అందుకనే నాని ఆ బై లింగ్వల్ జోలికి పోలేదు.అలా ఇప్పటివరకు శర్వానంద్, అల్లు శిరీష్, సందీప్ కిషన్ ఇలాంటి హీరోలు తెలుగు తమిళ భాషల్లో ప్రయత్నం చేసి విఫలమయ్యారు.

ఇప్పుడు తాజాగా నటించిన కస్టడీ సినిమా కూడా రెండు భాషల్లో విడుదల చేస్తున్నారు.

మరి సినిమా సక్సెస్ అవుతుందా లేదా అన్నది ప్రస్తుతం ఆ వ్యక్తిగతంగా మారింది.

ఇప్పటివరకు గతంలో తెలుగు తమిళంలో సినిమా ఒకేసారి విడుదల చేసిన హీరోలు అందరూ కూడా ప్లాప్ అయ్యారు.

మరి నాగచైతన్య సక్సెస్ అవుతాడా లేదా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

కస్టడీ సినిమాలో ఎక్కువ శాతం తమిళ నటులే ఉన్నారు.ఈ సినిమాతో నాగచైతన్య పెద్ద సాహసమే చేస్తున్నాడని చెప్పవచ్చు.

మరి నాగచైతన్య కష్టం ఫలించి ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

దారుణం: ఐసీ క్రీం ఇప్పిస్తామంటూ లైంగిక దాడి!