ఆ స్వాగ్ ను మెగాస్టార్ సినిమా మొత్తం మ్యాచ్ చేయగలరా?

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో రఫ్ ఆడిస్తున్నాడు.

ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ కుర్ర హీరోలకే సవాల్ విసురుతున్నాడు.

ఇటీవలే ఈయన నటించిన ఆచార్య సినిమా రిలీజ్ అయ్యి ఈయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది.

దీంతో మెగా ఫ్యాన్స్ సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు.మరి ఈ దెబ్బతో మెగాస్టార్ చాలా విషయాల్లో మార్పులు చేసుకుంటున్నారు.

ప్రెసెంట్ చిరంజీవి తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.మరి ఈ సినిమాలో చిరు చివరి వరకు తన స్వాగ్ మైంటైన్ చేస్తారా లేదా అనే దాని గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది.

"""/"/ ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రివీల్ చేసారు.

ఇందులో చిరు గ్లాసెస్ పెట్టుకుని స్టైల్ గా నడుచుకుంటూ వస్తూ తన లుక్ లో రాజసం చూపించారు.

ఈయన తన వయసుకు తగ్గ పాత్రలో కనిపించడంతో ఈయన లుక్ అందరిని ఆకట్టు కుంది.

అయితే ఈ ఫస్ట్ లుక్ వచ్చిన దగ్గర నుండి ఒరిజినల్ సినిమాలోని మోహన్ లాల్ తో చిరు లుక్ ను పోల్చుతూ సోషల్ మీడియాలో చర్చలు మొదలు పెట్టారు.

ఈ సినిమాలో మోహన్ లాల్ సినిమా మొత్తం పంచ, షర్ట్ తో ఫుల్ వైట్ అండ్ వైట్ తో ఆకట్టు కున్నారు.

అయితే గాడ్ ఫాదర్ లో మాత్రం మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చిరు లుక్ ను డిజైన్ చేసారు.

ఈ లుక్ మెగా ఫ్యాన్స్ ను బాగానే ఆకట్టుకుంది.అయితే ఈ లుక్ వరకు బాగానే ఉంది కానీ మోహన్ లాల్ అంత చిరు సినిమా మొత్తం మెప్పిస్తాడా? అంత స్వాగ్ చూపించగలరా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

చూడాలి మరి ఈ సినిమాతో ఏ రేంజ్ లో హిట్ అందుకుంటాడో.

గబ్బర్ సింగ్ రీ రిలీజ్ లో రికార్డు లను బ్రేక్ చేస్తుందా..?