మరోసారి జక్కన్న కోసం మహేష్ త్యాగం చేయనున్నాడా!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెసెంట్ పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమాను మహేష్ బాబు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.

అందరికంటే మహేష్ బాబునే సంక్రాంతి రేస్ లో తన సినిమాను నిలిపాడు.2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాతో పాటు మహేష్ కు పోటీగా ప్రభాస్ రాధేశ్యామ్, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలు బరిలోకి దిగాయి.

ఇంకా మరొకొన్ని సినిమాలు కూడా సంక్రాంతి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే మోస్ట్ అవైటెడ్ సినిమా ఆర్ ఆర్ ఆర్ కూడా సంక్రాంతి బరిలోకి రాబోతుందని వార్తలు వస్తున్నాయి.

ఆర్ ఆర్ ఆర్ సినిమా అక్టోబర్ 13న దసరా రేస్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

కానీ కరోనా కారణంగా పూర్తి స్థాయిలో థియేటర్స్ ఓపెన్ అవ్వకపోవడంతో ఆర్ ఆర్ ఆర్ సినిమాను రాజమౌళి వాయిదా వేశారు.

అయితే ఇప్పుడు కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ ఈ సినిమాను విడుదల చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా కోసం అనువైన తేదీని దర్శకనిర్మాతలు వెతికే వేటలో ఉన్నారు.

"""/"/ అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగేందుకు ముందుగా రాజమౌళి ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాను వాయిదా వేసుకోవాలి కోరారట.

కానీ ఈ సినిమా ఇప్పటికే పలు వాయిదాలు పడుతూ వచ్చింది.అందుకే ఇక ఇప్పుడు మహేష్ సర్కారు వారి పాట సినిమాను వాయిదా వేసుకోమని మేకర్స్ కోరుతున్నారట.

"""/"/ ఇక ఇప్పటికే మహేష్ బాహుబలి సినిమా కోసం తన రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాడు.

ఇక ఇప్ప్పుడు మరొకసారి మహేష్ తన సినిమాను వదులుకోమని రాజమౌళి కోరడంతో చిత్ర యూనిట్ ఆలోచనలో పడిందట.

కానీ మహేష్ కు సంక్రాంతి సీజన్ బాగా కలిసి వస్తుంది.అయితే రాజమౌళి మహేష్ కు మధ్య మంచి స్నేహం ఉంది.

అంతేకాదు చరణ్, ఎన్టీఆర్ తో కూడా మంచి సంబంధాలు మైంటైన్ చేస్తున్నాడు.ఇక ఇప్పుడు వీరందరూ కలిసి అడిగితే మహేష్ కాదనక పోవచ్చని వాదనలు వినిపిస్తున్నాయి.

కానీ మహేష్ ఆర్ ఆర్ ఆర్ కోసం సర్కారు వారి పాట సినిమాను వాయిదా వేసుకుంటే మరొక మంచి సీజన్ దొరికే అవకాశం పోతుందని కూడా ఆలోచిస్తున్నారు.

మరి చూడాలి మహేష్ బృందం ఏం నిర్ణయం తీసుకుంటారో.