Mahesh Babu Janatha Garage : జనతా గ్యారేజ్ లో మహేష్ బాబు ఒక పాట పాడాడా..? అది సినిమాలో ఎందుకు లేదంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు( Mahesh Babu ) చాలా తక్కువ సమయం లోనే వరుస సక్సెస్ లను అందుకొని ఉన్నతమైన స్థాయికి చేరుకున్నాడు.

ఆయన ఇటు సినిమాలు, అటు యాడ్స్, బిజినెస్ లు చేసుకుంటూనే అన్నింటినీ సమపాలల్లో మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక రీసెంట్ గా ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన గుంటూరు కారం( Guntur Karam ) సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.

అయినప్పటికీ తను ఎక్కడ కూడా నిరాశ పడకుండా తనని తాను మౌల్డ్ చేసుకుంటూ రాజమౌళి( Rajamouli ) సినిమా కోసం సంసిద్ధమవుతున్నాడు.

ఇక అందులో భాగంగానే ఆయన లుక్కు కూడా మొత్తం మార్చుకున్నాడు.ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో తను నటించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఈ సినిమాతో ఒక్కసారిగా ఫ్యాన్ వరల్డ్ లోకి మహేష్ బాబు ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇక ఇప్పటివరకు ప్యాన్ ఇండియా సినిమా కూడా చేయని మహేష్ బాబు ఇప్పుడు పాన్ వరల్డ్ లో సినిమా( Pan World Movie ) చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

"""/" / ఇక ఇది ఇక ఉంటే మహేష్ బాబు ఇప్పటివరకు బిజినెస్ మాన్ సినిమాలో( Business Man Movie ) ఒక పాటని పాడాడు.

దాన్ని మినహాయిస్తే ఇంతవరకు ఆయన ఏ సినిమాలో కూడా పాటనైతే పడలేదు.ఇక ఎన్టీఆర్( NTR ) తను చేసిన జనతా గ్యారేజ్( Janatha Garage Movie ) సినిమాలో మహేష్ బాబు చేత ఒక పాట పాడించాలని ప్రయత్నం చేశాడు.

దానికి మొదట మహేష్ బాబు ఇంట్రెస్ట్ చూపించ లేదు.కానీ ఎన్టీఆర్ అడగడంతో కాదనలేక పోయాడు ఇక దాంతో పాట పడటానికి సిద్ధమయ్యాడు.

కానీ ఆ తర్వాత సినిమాలో ఆ పాట ఉంటుందో లేదో అనే క్లారిటీ అయితే లేదు.

దాంతో దర్శకుడు ఎన్టీఆర్ తో ఈ పాట మనం మహేష్ బాబు తో పాడించి మళ్ళీ సినిమాలో పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది.

"""/" / ఆయన ఫీల్ అయిపోతాడు అనే ఉద్దేశ్యం తో ఆ పాటని పడించ లేదు.

దాంతో మహేష్ బాబు కూడా పాట పడకుండానే వెనుతిరగాల్సి వచ్చిందట.ఇక దర్శకుడు అనుకున్నట్టుగానే ఈ సినిమా అయిపోయాక చూసుకుంటే ఆ పాటకి ఆ సినిమాలో స్పేస్ లేదు.

కాబట్టి మహేష్ బాబుతో ఈ పాట పాడించక పోవడమే మంచిది అయింది.అదే ఒక వంతుకు బెటర్ అయిందని కొరటాల శివ( Koratala Siva ) ఆ తర్వాత ఎన్టీఆర్ తో చెప్పారట.

ఇక ఎన్టీఆర్ కూడా మహేష్ బాబు పాట పాడతానని చెప్పినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు.

కానీ సినిమా నిడివిలో అది సరిగ్గా సెట్ అయ్యే విధంగా లేకపోవడం వల్ల మళ్లీ ఆ నిర్ణయాన్ని మార్చుకొని ఆ పాటను క్యాన్సిల్ చేసుకున్నందుకు మహేష్ కి సారీ కూడా చెప్పాడట.

మొటిమల్లేని మెరిసే చర్మం కోసం ఈ మ్యాజికల్ రెమెడీని ప్రయత్నించండి..!