Guntur Kaaram : ఉగాదికి ఆ సంచలన రికార్డ్ ను మహేష్ బాబు బ్రేక్ చేస్తారా.. బుల్లితెరపై అదుర్స్ అనిపిస్తారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu )ను క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తారు.

లేడీస్ లో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ మహేష్ సొంతమనే సంగతి తెలిసిందే.

మహేష్ ఫ్లాప్ సినిమాలు సైతం బుల్లితెరపై రేటింగ్స్ పరంగా అదరగొట్టిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.

అతడు, ఖలేజా సినిమాలు బుల్లితెరపై వందల సార్లు ప్రసారమైనా ఈ సినిమాలు ప్రేక్షకులకు బోర్ కొట్టవు.

మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు( Sarileru Neekevvaru ) 2020 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా బుల్లితెరపై ఉగాది కానుకగా ప్రసారమై అప్పట్లో 23.4 రేటింగ్ ను సొంతం చేసుకుంది.

అయితే గుంటూరు కారం మూవీతో మహేష్ బాబు ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తారని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

గుంటూరు కారం సినిమా కూడా ఉగాది కానుకగా( Ugaadi ) బుల్లితెరపై ప్రసారం కానుందని తెలుస్తోంది.

"""/"/ గుంటూరు కారం( Guntur Kaaram ) శాటిలైట్ హక్కులను సైతం జెమిని ఛానల్ సొంతం చేసుకోవడంతో బుల్లితెరపై మహేష్ బాబు తన సినిమాతో అదుర్స్ అనిపిస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ కు బుల్లితెర ప్రేక్షకుల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

అందువల్ల గుంటూరు కారం రేటింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయని సూపర్ స్టార్ అభిమానులు ఫీలవుతున్నారు.

"""/"/ గుంటూరు కారం మూవీ డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్( Netflix ) సొంతం చేసుకోగా నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ భారీ హిట్ గా నిలిచింది.

జెమిని ఛానల్( Gemini Channel ) లో ఈ సినిమా రికార్డ్ లన్నీ బ్రేక్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

సినిమాలో లేని సాంగ్స్ ను కూడా యాడ్ చేసి బుల్లితెరపై ఈ సినిమా ప్రసారం కానుందని తెలుస్తోంది.

త్వరలో ఇందుకు సంబంధించి అధికారిక అప్డేట్ రానుందని భోగట్టా.

రీల్ కోసం ప్రాణాల‌తో చెల‌గాటం.. రైల్వే బ్రిడ్జిపై ఈ మూర్ఖుడు చేసిన పని చూస్తే!