నాని సినిమాకు మెాహన్ బాబు ప్లస్ అవుతాడా? మైనస్ అవుతాడా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ( Telugu Film Industry )ఉన్న చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.

ఇక నాని ( Nani )లాంటి స్టార్ హీరో సైతం తనదైన రీతిలో సత్తా చాటడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు.

ఇక ఇప్పటికే వరుసగా దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నాడు.

ఇక ఈ సినిమా డైరెక్టర్ అయిన శ్రీకాంత్ ఓదెలతో( Srikanth Odela ) మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ప్యారడైజ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు( Mohan Babu ) విలన్ గా నటిస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

"""/" / మరి మోహన్ బాబు ఈ సినిమాలో నటించడం వల్ల సినిమాకి ఏమైనా హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు.

నిజానికి మోహన్ బాబు లాంటి పెద్ద నటుడు సినిమాలో ఉండడం వల్ల సినిమాకి కొంతవరకు హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కానీ మోహన్ బాబు లాంటి వ్యక్తి సినిమాలో ఉంటే ఈ సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా దర్శకుడు తీయగలుగుతాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఎందుకంటే ఆయన కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడని చాలామంది చెబుతూ ఉంటారు.

మరి ఇలాంటి క్రమంలో శ్రీకాంత్ ఓదెల మోహన్ బాబుని తీసుకొని మంచి పని చేస్తున్నాడా లేదంటే ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో సినీ విమర్శకులు సైతం ఆలోచిస్తున్నారు.

"""/" / అయితే మోహన్ బాబు సినిమాలో ఉన్నాడా లేదా అనే విషయాన్ని శ్రీకాంత్ ఇప్పటివరకు స్పష్టం చేయలేదు.

కాబట్టి సినిమా నుంచి ఇంక ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేంతవరకు మోహన్ బాబు ఈ సినిమాలో ఉన్నాడనే విషయం మీద సరైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు.

వైరల్ వీడియో: పట్టపగలు నడిరోడ్డుపై స్కూల్ విద్యార్థిని కిడ్నాప్