లావణ్య అలా చేసేందుకు మెగా ఫ్యామిలీ.. మెగా ఫ్యాన్స్‌ ఒప్పుకుంటారా?

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) మెగా వారి ఇంటి కోడలు అవ్వబోతుంది.

మెగా బ్రదర్‌ నాగబాబు ఒక్కగానొక్క కొడుకు వరుణ్‌ తేజ్ ని( Varun Tej ) వివాహం చేసుకోబోతుంది.

ఇండస్ట్రీలో అందాల రాక్షసి సినిమా తో అడుగు పెట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు సినిమాలు చేస్తూనే ఉంది.

సాధారణంగా స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు రాని వారు కొన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండి కనిపించకుండా పోతారు.

కానీ లావణ్య త్రిపాఠి తన ప్రతిభతో మరియు అందంతో ఆకట్టుకుంటూ వచ్చింది.ఇక లావణ్య త్రిపాఠి రెగ్యులర్ గా సోషల్‌ మీడియా లో షేర్‌ చేసే ఫోటోలు మరియు వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి.

"""/" / తాజాగా ఈ అమ్మడు మెగా వారి ఇంటి కోడలు అవ్వబోతున్న నేపథ్యం లో ఇండస్ట్రీ లో ముందు ముందు సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సాధారణంగా మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారిక ను ఇండస్ట్రీ కి పరిచయం చేసి మంచి మనసును చాటుకున్నాడు.

కనుక కోడలు హీరోయిన్‌ గా నటిస్తాను అంటే అడ్డు చెప్పక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

చిరంజీవి ఫ్యాన్స్( Chiranjeevi Fans ) మాత్రం లావణ్య త్రిపాఠి యొక్క సినీ ఎంట్రీని అడ్డుకుంటారేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

"""/" / ఫ్యాన్స్‌ నుండి వ్యతిరేకత వచ్చినా కూడా కుటుంబ సభ్యులు మాత్రం ఈమె సినిమా ఇండస్ట్రీ జర్నీ ని కొనసాగించేందుకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

వరుణ్‌ బాబు మరియు లావణ్య కలిసి నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.మొత్తానికి మెగా వారి ఇంటి కోడలు అవ్వబోతున్న లావణ్య త్రిపాఠి చాలా అదృష్టవంతురాలు అంటూ సోషల్‌ మీడియాలో అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

ఆ ఫ్యామిలీ మెంబర్స్ ను కలిసేందుకు కూడా చాలా మందికి అవకాశం రాదు.

అలాంటిది ఆ ఇంటి కోడలిగా లావణ్య త్రిపాఠి వెళ్లబోతుంది.

మానవత్వం మంటగలిసింది.. శవం కాళ్లకు గుడ్డ కట్టి ఎలా ఈడ్చుకెళ్లారో చూస్తే..