పవన్ సినిమాలో మహానటి... నిజమేనా...?

దాదాపుగా మూడేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది.ఈ చిత్రానికి సంబంధించినటువంటి చిత్రీకరణ ఇప్పటికే మొదలైనప్పటికీ నటీనటుల విషయంలో మాత్రం పలు వార్తలు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి హీరోయిన్ వార్త నెట్ లో బాగా హల్ చల్ చేస్తోంది.

ఇందులో అజ్ఞాతవాసి చిత్రంలో  సూర్యకాంతం పాత్రలో మెప్పించినటువంటి కీర్తి సురేష్ ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేగాక ఈ చిత్రానికి "విరూపాక్ష" అనే టైటిల్ ని కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఖరారు చేసినట్లు సమాచారం.

అయితే ఈ విషయాలపై చిత్ర యూనిట్ సభ్యులు గానీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి గాని ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

"""/"/ అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించినటువంటి పింక్ చిత్ర రీమేక్ లో కూడా నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

 .

పాత్ర ఏదైనా ఆ పని అస్సలు చేయను.. జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్!