కే‌సి‌ఆర్ సోలో మంత్రం.. అందుకే దూరం ?

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్( CM Kcr ) దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత మోడీ ( Narendra Modi ) ని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగారు.

ఆయన వేసే ప్రతి అడుగు కూడా టార్గెట్ మోడీ గానే సాగింది.వచ్చే ఎన్నికల్లో బిజెపి ( Bjp )విముక్త భారత్ తమ ఎజెండా అని కే‌సి‌ఆర్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు.

అందుకోసం విపక్షాలతో కలిసి పని చేసేందుకు కూడా సిద్దమే అని స్పష్టం చేశారు కూడా.

కానీ ఏమైందో తెలియదు గాని.ప్రస్తుతం విపక్షాలతో కలిసేందుకు కే‌సి‌ఆర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ఏ ప్లాన్ అయిన సోలోగానే అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.ఇటీవల విపక్షాల ఐక్యత కోసం పాట్నాలో దాదాపు 22 పార్టీలన్నీ సమావేశం అయిన సంగతి తెలిసిందే.

నితీశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కే‌సి‌ఆర్ హాజరు కాలేదు. """/" / దీంతో విపక్షాల విషయంలో కే‌సి‌ఆర్ ఎందుకు దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది.

అయితే కే‌సి‌ఆర్ విపక్షలకు దూరంగా ఉండడానికి క్దుయ కారణం లేకపోలేదు.అటు బిజెపి మరియు ఇటు కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బి‌ఆర్‌ఎస్ ను నిలపాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు మద్దతు తెలిపే పార్టీలతో బి‌ఆర్‌ఎస్ కలిసి నడిస్తే.

అంతర్గతంగా కాంగ్రెస్ బి‌ఆర్‌ఎస్ మద్య పొత్తు ఉందనే వాదన ఇటు తెలంగాణ రాజకీయాల్లో కూడా బలపడే అవకాశం ఉంది.

అందుకే బిజెపిని గద్దె దించే విషయంలో విపక్షాలతో కలిసి నడిచేందుకు కే‌సి‌ఆర్ మొగ్గు చూపడం లేదనేది కొందరి మాట.

"""/" / మరి మోడీని గద్దె దించడం కే‌సి‌ఆర్ ఒక్కడి వల్ల సాధ్యమేనా అంటే సమాధానం లేని పరిస్థితి.

దీన్ని బట్టి కాంగ్రెస్, బిజెపి అండలేని ఇతర పార్టీలను కలుపుకొని థర్డ్ ఫ్రంట్ దిశగా కే‌సి‌ఆర్ అడుగులు వేస్తున్నట్లు కొందరి అభిప్రాయం.

విపక్షాల సమావేశానికి ఎందుకు హాజరు కాలేదనే దానిపై కే‌టి‌ఆర్ కూడా క్లారిటీ ఇచ్చారు.

బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బి‌ఆర్‌ఎస్ ను నిలపాలని, డిల్లీ కేంద్రంగా కాకుండా హైదరబాద్ కేంద్రంగా రాజకీయాలు చేస్తామని కే‌టి‌ఆర్ స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.థర్డ్ ఫ్రంట్ వైపు బి‌ఆర్‌ఎస్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

మరి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కే‌సి‌ఆర్ వేస్తున్న అగుగులు ఎలాంటి సంచలనాలకు దారి తీస్తాయో చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్ట్2, శుక్రవారం 2024