ద్రౌపది ముర్ముకు కేసీఆర్ విషెస్ చెప్తారా?

భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము(64) ఘనవిజయం సాధించారు.రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా మూడు రౌండ్లలోనూ ద్రౌపది ముర్ముకు ఆధిక్యం లభించింది.

ముర్ముకు మొత్తంగా 2161 ఓట్లు రాగా.విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 1058 ఓట్లు వచ్చాయి.

దీంతో ద్రౌపది ముర్ముకు మొత్తం ఓట్ల విలువ 5,77,777 కాగా యశ్వంత్ సిన్హా ఓట్ల విలువ 2,61,062గా ఉంది.

అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలుస్తోంది.రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ చెల్లదు.

అంటే క్రాస్‌ ఓటింగ్‌కు ఆస్కారం ఉంటుంది.ఆత్మప్రభోధానుసారం ఓటేయాలన్న పిలుపును సీరియస్‌గా తీసుకున్న చాలామంది ప్రజాప్రతినిధులు గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును గెలిపించుకున్నారు.

దీంతో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆశలు గల్లంతయ్యాయి.యశ్వంత్ సిన్హా గెలవకపోయినా ఆశించిన స్థాయిలో ఓట్లు వస్తాయని అందరూ అభిప్రాయపడ్డారు.

"""/"/ రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ అనుకున్నదొక్కటి.అయినదొక్కటి అన్న చందంగా కనిపించింది.

మొత్తానికి నంబర్‌గేమ్‌ను అంచనా వేయడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు.అయితే రాష్ట్రపతిగా గెలిచిన ముర్ముకు కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు శుభాకాంక్షలు తెలపకపోవడం చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ ప్రదర్శించిన రాజకీయ పరిణితి, టీడీపీ ప్రదర్శించిన రాజకీయ చతురత కారణంగా వారికి పబ్లిక్‌లో కాస్తో కూస్తో ఇమేజ్ పెరిగింది.

కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో సత్తా చాటుతాం అని బీరాలు పలికిన కేసీఆర్ మాత్రం ఆశించిన స్థాయిలో ఓట్లను కూడగట్టలేకపోయారు.

చివరకు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ముర్ముకే ఓటు వేసినట్లు తెలుస్తోంది.

దీంతో కేసీఆర్‌కు షాక్ తగిలినట్లు అయ్యింది.కాగా ఒడిశాలోని బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న సంతాల్ అనే సంప్రదాయ గిరిజన కుటుంబంలో ద్రౌపది ముర్ము జన్మించారు.

టీచర్‌గా పనిచేస్తూ బీజేపీ పట్ల ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు.

వీడియో వైరల్‌: జగన్నాథుడికి వినంభ్రంగా ప్రార్థించిన కోడి..