ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే లపై కేసీఆర్ చర్యలు తీసుకుంటారా ?

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి అందరికంటే ఎక్కువగా టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ టెన్షన్ పడుతున్నారు.

బిజెపి, కాంగ్రెస్ ల కంటే ఎక్కువగా కేసీఆర్ లో కంగారు కనిపిస్తోంది.ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మక కావడంతో పాటు,  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న తనుకు ఈ మునుగోడు ఎన్నికలలో వచ్చే ఫలితాలే ప్రభావం చూపిస్తాయనే కంగారు కేసీఆర్ లో ఉంది.

అందుకే ఇక్కడ గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా కేసీఆర్ విభజించి ఎమ్మెల్యేలకు ఇన్చార్జీలుగా బాధ్యతలను అప్పగించారు కేసిఆర్.

  ఈ ఉప ఎన్నికలు ముగిసే వరకు ఎవరు తమ బాధ్యతలను వదిలిపెట్టి బయటికి వెళ్ళొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

కొంతమంది పనితీరు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉందని,  వారంతా తమ పద్ధతిని మార్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

అయితే నాంపల్లి మండలం మేల్వాయి ఇన్చార్జిగా ఉన్న గువ్వల బాలరాజు , చుండూరు మండలం ఉడతపల్లి ఇంచార్జీ గా ఉన్న పైలెట్ రోహిత్ రెడ్డిలు మొయినాబాద్ ఘటనలో ఉండడం కలకలం రేపింది.

వీరిద్దరూ ముడుపుల కోసమే వచ్చారా లేక పార్టీ అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు వెళ్లారా అనేది ఇంకా క్లారిటీ లేదు.

అయితే ఈ విషయంలో కెసిఆర్ ప్రమేయం ఏమి ఉండదనే వాదన బలపడుతున్న క్రమంలో పార్టీ గీత దాటిన ఎమ్మెల్యేలపై కేసీఆర్ కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఉత్కంఠ కలిగిస్తోంది.

  """/"/  వీరే కాకుండా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలు ఉండడంతో వీరి పైనా కెసిఆర్ చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా అనే విషయం పైన ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తోంది.

ఏది ఏమైనా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ తీసుకున్నా.

ఆ పార్టీ నాయకులు మాత్రం కెసిఆర్ తాపత్రయాన్ని అర్థం చేసుకున్నట్టుగా కనిపించడం లేదు.

ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు కొంతమంది బీజేపీ లోకి వెళ్ళిపోయారు.మరికొంతమంది వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.

వైరల్ వీడియో: దొంగలు పడితే తెలిసేలా అదిరిపోయే జుగాడ్ ట్రిక్!