ప్రజల వ్యతిరేకత ఉన్న అంశాలపై ఇక కేసీఆర్ దృష్టి సారించనున్నారా?

కేసీఆర్ ఎంత చతురత కలిగిన రాజకీయ నాయకుడో మనకు తెలుసు.అయితే కేసీఆర్ తన అవరోధాన్ని అవకాశంగా ఎలా మలుచుకుంటాడనేది ఎన్నో సార్లు రుజువైంది.

ఉదాహరణకు తీసుకుంటే ఆర్టీసీ సమ్మె తెలంగాణలో ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే.

ఆ సమయంలో కేసీఆర్ ప్రతి ఆర్టీసీ కార్మికుడు ఎంతగా విమర్శించారో చూసాం.తరువాత ఒక్కసారిగా వాళ్ళ కోరికలను తీర్చి, కొన్ని కొరియర్ సర్వీస్ ను ప్రారంభించి ఇప్పుడు ఆర్టీసీకి తన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను సూచించాడు.

ప్రస్తుతం కేసీఆర్ కు కూడా ఇప్పుడు యువతకు ఉద్యోగాల సమస్య అనేది కేసీఆర్ ముందున్న అంశం.

దానిని ఒకే ఒక భర్తీ ద్వారా ఉద్యోగ నియామకాలను చేపడితే ఇక ప్రజల నీరాజనాలను కేసీఆర్ అందుకోనున్నాడు.

కేసీఆర్ వ్యూహం అనేది అంత సులభంగా అర్థం కాదు కనుక దాని అంతరార్థం తెలియాలంటే మనం మరిన్ని రోజులు ఆగాల్సిందే.

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు వాటిని నెరవెరిస్తే ప్రజల మెప్పు పొందగలిగే అవకాశం ఎక్కువ.

అందుకే కేసీఆర్ ఎక్కువ ఈ వ్యూహాన్ని ఎంచుకుంటారు.ఈ సారి కూడా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ సమస్యను కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో నెరవేర్చే అవకాశం ఎక్కువ.

త్వరలో బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో వీటిపై ఏమైనా ప్రకటన వస్తుందో లేదో చూడాలి.

విశాఖ సౌత్ వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!