క‌లిసిరాని ఆ సెంటిమెంట్‌ను ఇక‌నైనా కేసీఆర్ వ‌దిలేస్తారా..

కేసీఆర్ కు మొద‌టి నుంచి కొన్ని సాంప్ర‌దాయాలు ఉన్నాయి.తాను ఏ ప‌ని చేసే ముందు అయినా స‌రే కొన్ని న‌మ్మ‌కాల‌ను పాటిస్తారు.

చిన్న ప‌ని ద‌గ్గ‌రి నుంచి పెద్ద స‌భ‌ల దాకా అన్నింటికీ కొన్ని సెంటిమెంట్లు పెట్టుకుంటారు.

ఇక వాస్తు ప‌ర‌మైన లేదంటే ముహూర్తాల ప‌రంగా ఆయ‌న పాటించే విధానాలు అన్నీ ఇన్నీ కావ‌నే చెప్పాలి.

అయితే ఇలా కేసీఆర్ ఎల‌క్ష‌న్ల టైమ్ లో కూడా కొన్ని సెంటిమెంట్ల‌ను పెట్టుకునేవారు.

కాగా ఇందులో ఓ సెంటిమెంట్ కేసీఆర్‌కు అస్స‌లు క‌లిసిరావ‌ట్లేద‌నే చెప్పాలి.అది ఆయ‌న్ను బాగా ఇబ్బంది పెట్టేస్తోంది.

ఇంత‌కు ముందు ఆయ‌న ఏదైనా పనిని స్టార్ట్ చేసేముందు త‌న‌కు బాగా క‌లిసి వ‌చ్చే ఆరు సెంటిమెంట్‌ను బాగా వాడేవారు.

అయితే ఆయ‌న స్కీముల‌కు మాత్రం 'పదిని వాడేస్తున్నారు.రైతుబంధు నుంచే ఆయ‌న ఈ సెంటిమెంట్ ను వాడేస్తున్నారు.

కాగా ఈ సెంటిమెంట్ ను గ్రేటర్ హైదరాబాద్ ఎల‌క్ష‌న్ల స‌మ‌యంలో వాడేశారు.వ‌ర‌ద బాధితుల‌కు ఇంటికి రూ.

10 వేలు ఇస్తామ‌ని చెప్పినా ఎవ‌రూ ఓటేయ‌క‌పోవ‌డం, తీరా ఎన్నిక‌లు అయిపోయాక దాన్ని ఆపేయ‌డం చూశాం.

ఇదే ఫార్ములాను మ‌రోసారి హుజూరాబాద్ ఎన్నిక‌ల సమయంలో వాడేశారు. """/"/ ఇక హుజూరాబాద్ ను అన్ని ఎన్నిక‌ల కంటే సీరియ‌స్ గా తీసుకున్న కేసీఆర్ ఏకంగా ద‌ళిత‌బంధు స్కీమ్ ను తీసుకొచ్చి ఇంటికి రూ.

10ల‌క్ష‌లు ఇస్తామ‌ని చెప్పారు.గ్రేట‌ర్ లో ఆల్రెడీ ప‌ది ఫార్ములా బెడిసికొట్టిన‌ప్పుడే అల‌ర్ట్ కావ‌డం మ‌ర్చిన కేసీఆర్ మ‌రోసారి ప‌ది ఫార్ములాను హుజూరాబాద్ లో అమ‌లు చేశారు.

కానీ ఇక్క‌డ కూడా త‌న‌కు చేదు అనుభ‌వ‌మే ఎదురైంది.ఇక్క‌డి ప్ర‌జ‌లు కూడా ప‌ది ఫార్ములాకు ఓటెయ్య‌లేక‌పోయారు.

దీంతో బీజేపీ ఇక్క‌డ కూడా కేసీఆర్ వ్యూహాల‌కు చెక్ పెట్టిన‌ట్ట‌యింది.కాబ‌ట్టి ఇప్ప‌టికైనా ప‌ది ఫార్ములాను ఎల‌క్ష‌న్ల స‌మ‌యంలో కేసీఆర్ ప‌క్క‌న పెడుతారు అన్న‌ది చూడాలి.

ఈ వంటింటి చిట్కాల‌తో క‌డుపు నొప్పి మ‌టాష్‌..!