కవితను అరెస్ట్ చేస్తారా ? కేసీఆర్ అత్యవసర మీటింగ్ అందుకేనా ? 

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం తెలంగాణ రాజకీయాలతో పాటు, దేశ రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది.

ఇప్పటికే అనేకమంది ఈ వ్యవహారంలో అరెస్టు అయ్యారు.ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలతో పాటు, ఏపీలోని అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ కుమారుడు అరెస్టయ్యారు.

అలాగే ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

ఇప్పటికే కవిత పాత్ర ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు తేల్చాయి.ఈ వ్యవహారం లో ఇప్పటికే అనేక అరెస్టులు జరిగాయి.

ముఖ్యంగా కవితకు అత్యంత సన్నిహితులుగా పేర్కొందిన బోయినపల్లి అభిషేక్ , శరత్ చంద్ర రెడ్డి , వ్యక్తిగత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేశారు.

ఇక ఇందులో మిగిలింది కవితనే.త్వరలోనే కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తేలడంతో,  ఈ వ్యవహారంపై బి ఆర్ ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ టెన్షన్ పడుతున్నారు.

"""/"/  ఒకవేళ దర్యాప్తు సంస్థలు కవితను అరెస్ట్ చేస్తే తరువాత ఏం చేయాలని విషయం పైన కెసిఆర్ ముందుగానే పార్టీ కీలక నాయకులతోపాటు, కొంతమంది ప్రముఖులతో కేసీఆర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు తో పాటు రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ ఎంపీ దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ అత్యవసర సమావేశంలో ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం పైన కవిత అరెస్టు జరిగితే తలెత్తే పరిణామాల పైన క్షుణ్ణంగా చర్చించారట.

ఇప్పటికే దర్యాప్తు సంస్థలు కవితను ప్రచారణకు పిలుస్తున్నారు.ఒకవేళ విచారణ కు పిలిచి ఆమెను అరెస్టు చేస్తే,  తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పై ఏ స్థాయిలో ప్రభావం చూపుతుంది ?  లీగల్ గా ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయం పైన ప్రధానంగా చర్చించారట.

"""/"/ ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో దర్యాప్తు రిపోర్ట్ ను కోర్టు సమర్పించిన  నేపథ్యంలో సిబిఐ , ఈడీ  నిందితులపై మోపిన అభియోగాలు ఇవన్నీ కెసిఆర్ కు ఆందోళన కలిగిస్తున్నాయి.

దర్యాప్తు సంస్థలు ఛార్జి షీట్ లో కవిత పేరును పదేపదే ప్రస్తావించడం, మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు చేయడం,  కిక్ బ్యాక్ ల పేరుతో ముడుపు ఇవ్వడం,  వైన్ షాపులకు లైసెన్సులు పొంది లాభాలు ఆర్జించడం, పాలసీ రూపకల్పంలోనే కవితతో అనేకమంది చర్చలు జరపడం,  ఇలా అన్నిట్లోనూ ఆమె పాత్ర ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు తేల్చాయి.

ఎప్పటికే కవితకు అత్యంత సన్నిహితులుగా పేర్కొందిన వారందరినీ అరెస్టు చేసిన నేపథ్యంలో,  కవిత కూడా అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్లు కేసిఆర్ కూడా అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలోనే రాజకీయంగాను దీనిని ఎదుర్కొనేందుకు ముందుగానే సిద్ధమవుతున్నారట.కేంద్రంలో ఉన్న బిజెపిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ముందుకు వెళుతున్న క్రమంలోనే,  కవితను ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించి, కేంద్ర బిజెపి పెద్దలు ఇబ్బంది పెడుతున్నారనే సంకేతాలను తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు, తద్వారా ఇదంతా బీజేపీ కుట్రగా జనాల్లో అభిప్రాయం కలిగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారట.

జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి…  సీరియస్ తీసుకున్న పవన్