సత్యం సుందరం సినిమాతో కార్తీ కి నేషనల్ అవార్డు రానుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ తమిళ్ సినిమా హీరోల సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు.

నిజానికి తమిళంలో సక్సెస్ ఫుల్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్న రజినీకాంత్, కమల్ హాసన్ లతో పాటు సూర్య, విక్రమ్, కార్తీ లాంటి హీరోలు కూడా తెలుగులో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు.

కార్తీ 'సత్యం సుందరం' ( Satyam Sundaram )సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాడు.

అయితే ఈ సినిమాలో కార్తీ నటనకు గాను అతనికి చాలా అవార్డులు కూడా వరించబోతున్నాయి అంటూ సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఎందుకు అంటే ఈ సినిమాలో చిన్న చిన్న ఎమోషన్స్ ని కార్తీ( Karthi ) పండించిన తీరు అద్భుతంగా ఉందనే చెప్పాలి.

"""/" / ఇక మూడు గంటల పాటు సాగే ఈ సినిమాలో ఎక్కడ బోర్ కొట్టించకుండా తన నటనతో ప్రేక్షకుడిని మెప్పిస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు.

అలాంటిది కార్తీ మాత్రం ఆ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.ఆయన లాంటి నటుడు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు.

ముఖ్యంగా అన్ని ఎమోషన్స్ ని పండించే హీరోలు ఉన్నప్పటికీ ఒక డిఫరెంట్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ని ఎంచుకొని అందులో హవ భావాలను పలికించడంలో మాత్రం కార్తీ మొదటి స్థానం లో ఉంటాడు.

"""/" / అందుకే ఆయనకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది.ఇక ఈ సినిమాతో ఆయనకు 'నేషనల్ అవార్డు( National Award )' కూడా రాబోతుంది అంటూ మరి కొంతమంది సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా వల్ల కార్తీకి ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ చాలా బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి.

వీడియో: భార్య కోసం ఉద్యోగానికి రాజీనామా.. అదే రోజు ఆమె మృతి చెందడంతో?