కర్ణాటకపై కేసీఆర్ ఫోకస్.. త్వరలో మరో మాజీ ముఖ్యమంత్రి జంప్..?
TeluguStop.com
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిన దగ్గరి నుంచి జోరు పెంచారు.ఒక్కో రాష్ట్రంలో నేతలకు వల వేస్తూ.
పార్టీలోకి లాగుతున్నారు.దక్షిణాదిలో ఇప్పటికే ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాలతో పాటు గుజరాత్ లో పార్టీకి నేతలను వెతికి పట్టుకున్నారు.
ఇక ఇప్పుడు కర్ణాటకపై ఆయన ఫొకస్ పెట్టినట్టు తెలుస్తోంది.కర్నాటకలో కుమారస్వామి పార్టీని ఉపయోగించుకుని.
అక్కడ జెండా పాతాలని చూస్తున్నారు.మాజీ ప్రధాని అయిన దేవేగౌడ కుమారుడు మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామితో మంచి సాన్నిహిత్యాన్ని కేసీఆర్ కొనసాగిస్తూ ఉన్నారు.
"""/" /
కుమార స్వామిని కూడా బీఆర్ఎస్ పార్టీతో కలవాలనే ప్రతిపాదన తీసుకున్నట్టు తెలుస్తోంది.
కుదిరితో పొత్తు పెట్టుకోవాలని.కోరినట్టు వార్తలు వస్తున్నాయి.
అంతే కాకుండా ఏకంగా కుమార స్వామిని తన పార్టలో చేరడంపై ఆలోచించాలని మంచి ఆఫర్ ను ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఒక వేళ కేసీఆర్ ఆఫర్ నచ్చి.కుమార స్వామి బీఆర్ఎస్ కండువా కప్పుకుంటే.
అది దేశ స్థాయిలో చర్చనీయంగా మారుతుందనేది సీఎం కేసీఆర్ ప్లాన్. """/" /
ఒక ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నేత పార్టీ బీఆర్ఎస్ పార్టీలో విలీనం అయిందంటే.
అది జాతియ స్థాయిలో పార్టీ బలోపేతానికి పనికి వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు.స్వంతంగా కేడర్ ఉండి.
ప్రతీ సారీ సుమారు 50 నుంచి 70 స్థానాలకు పైగా ప్రభావం చూపుతున్న పార్టీ అసలు కేడరే లేని పార్టీలో కలుస్తుందా అనేది పెద్ద ప్రశ్న.
ఒక వేళ అదే జరిగితే మాత్రం కేసీఆర్ పెద్ద సక్సెస్ సాధించినట్టే అవతుందనేది విశ్లేషకుల భావన.
మరి కేసీఆర్ ఆఫర్ కు నిజంగా కుమార స్వామి తలూపుతారా అనేది లేదా అనేది వేచి చూడాలి.
రాజమౌళి మాదిరిగానే గోపీచంద్ మలినేని కూడా మరో పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడా..?