'కాజల్ అగర్వాల్' తల్లి కాబోతోందా...?

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ చందమామ కాజల్ అగర్వాల్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

తెలుగు స్టార్ హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దం పైగానే అవుతున్నా కూడా ఇప్పటికే అదే గ్లామర్ మెయిన్ టెన్ చేస్తూ దూసుకు పోతుంది.

స్టార్ హీరోలతోనే కాదు చిన్న హీరోలతో, సీనియర్ హీరోలతో కూడా వరస అవకాశాలు అందుకుంటూ కుర్ర భామలకు పోటీ ఇస్తుంది.

ఈ మధ్య ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ లో కూడా ఎంజాయ్ చేస్తుంది.

పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తా అని చెప్పడమే కాకుండా వరుస సినిమాలు ఒప్పుకుంటూ దూకుడుగా వ్యవహరిస్తోంది.

గ్లామర్ పాత్రలకు కూడా ఏమాత్రం అడ్డు చెప్పకుండా సినిమాలు చేస్తుంది.ప్రస్తుతం ఈ భామ మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమా చేస్తుంది.

"""/"/ ఇంతకు ముందు కూడా చిరంజీవి సరసన ఆడిపాడింది.మళ్ళీ రెండవ సారి కూడా అవకాశం అందుకుని ఫుల్ జోష్ లో ఉంది.

తన భర్త కూడా సినిమా విషయంలో ఎటువంటి అభ్యంతరం చెప్పక పోవడంతో కాజల్ కు ఫుల్ ఫ్రీడమ్ లభించింది.

ఇంతకు ముందు కన్నా మరింత గ్లామరస్ గా మారి తన అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాతో పాటు నాగార్జున సరసన కూడా ఒక అవకాశం అందుకుంది. """/"/ ఇది ఇలా ఉంటె కాజల్ అగర్వాల్ పిల్లలు కనాలని ఆశ పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు ఇప్పటికే ఆమె ప్రెగ్నెంట్ కూడా అని సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా వైరల్ వుంటుంది.

అదే కాదు కాజల్ సన్నిహితుల దగ్గర త్వరలోనే మా ఇంట్లో ఒక వ్యక్తి రాబోతున్నట్టు చెప్పిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియదు కానీ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది.

చూడాలి మరి ఈ వార్తలను కాజల్ ఖండిస్తుందో లేదో.

రాయ్‎బరేలి, అమేథి స్థానాలపై వీడిన సస్పెన్స్..!