Junior NTR , Balayya : బాలయ్య సినిమాను రీమేక్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్.. మరీ ఇంత ఘోరమేంటి అంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) సాధారణంగా రీమేక్ సినిమాలలో నటించడానికి ఇష్టపడరు.

తన సినీ కెరీర్ లో నరసింహుడు మినహా మరే మూవీ రీమేక్ కాదు.

నరసింహుడు సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేసి తెరకెక్కించినా సినిమా రిలీజ్ సమయంలో నిర్మాత చేసిన కొన్ని తప్పులు ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ కు కారణమయ్యాయి.

హీరో కొంత సమయం పాటు మూగవాడిగా కనిపించడం కూడా నరసింహుడు సినిమా ఫ్లాప్ కు కారణమైంది.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ స్ట్రెయిట్ సినిమాలలోనే నటిస్తుండగా ఈ హీరో బాలయ్య ( Balayya )నటించిన భైరవ ద్వీపం సినిమాను( Bhairava Dveepam ) రీమేక్ చేయబోతున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ఈ వార్తలు విన్న నందమూరి అభిమానులు మాత్రం నవ్వుకుంటున్నారు.భైరవద్వీపం దాదాపుగా 30 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమా కాగా అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా చూడని సినీ అభిమానులు చాలా తక్కువమంది ఉంటారు. """/" / ఈ సినిమాను రీమేక్ చేసినా హిట్ అయ్యే అవకాశాలు తక్కువ.

అప్పటి ప్రేక్షకుల అభిరుచికి ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి చాలా తేడా ఉంది.ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా 5 స్ట్రెయిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు.

బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సత్సంబంధాలు లేవని ఇద్దరి మధ్య మాటల్లేవని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

తారక్ భైరవద్వీపం సినిమాను రీమేక్ చేయడం రూమర్ మాత్రమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. """/" / జూనియర్ ఎన్టీఆర్ ఛాన్స్ ఉంటే తాత నటించిన గుండమ్మ కథ( Gundamma Katha ) లాంటి సినిమాలను రీమేక్ చేస్తారే తప్ప బాలయ్య సినిమాలను రీమేక్ చేయాల్సిన అవసరం తారక్ కు లేదు.

2024 ఎన్నికలకు కూడా తారక్ పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారు.ఏ పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా తారక్ కామెంట్లు చేయడం లేదు.

ముఖంపై నల్ల మచ్చలను పోగొట్టే మోస్ట్ పవర్ ఫుల్ చిట్కాలు మీకోసం!