ఆహ్వానం అందిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు తారక్ దూరం…ఇదే కారణమా?

నందమూరి స్వర్గీయ తారకరామారావు ( Taraka Ramarao ) శత జయంతి వేడుకలను ఎంత ఘనంగా నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఈనెల 20వ తేదీ జరగబోయే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు నందమూరి కుటుంబ సభ్యులందరికీ కమిటీ తరఫున ఆహ్వానం అందింది.

ఈ క్రమంలోని జూనియర్ ఎన్టీఆర్( NTR ) కి సైతం ఈ శత జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానం అందింది.

ఈ క్రమంలోనే కమిటీ సభ్యులు స్వయంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి తనకు ఆహ్వానం అందజేశారు.

గతంలో విజయవాడ( Vijayawada ) లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఎన్టీఆర్ కి ఏ విధమైనటువంటి ఆహ్వానం అందలేదు.

"""/" / ఈ క్రమంలోని ఈనెల 20వ తేదీ హైదరాబాదులో జరగబోయే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు నందమూరి కుటుంబ సభ్యుల( Nandamuri Family ) తో పాటు ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందింది.

అయితే ఈ వేడుకలకు ఎన్టీఆర్ చాలా వరకు వెళ్లక పోయే అవకాశాలు ఉంటాయని తెలుస్తుంది.

ఎన్టీఆర్ ను హైదరాబాద్ సభకు రావాలని ఆహ్వానించిన తరుణంలో ఆయన చేసిన కామెంట్స్ కనుక చూస్తే ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి బహుశా రాకపోవచ్చు అని తెలుస్తుంది.

ఈనెల 20వ తేదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. """/" / ఇక 20వ తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు( NTR Birthday ) కావడంతో తన ఫ్యామిలీతో కలిసి ఈయన మాల్దీవ్స్ వెళ్లడం కోసం అన్ని ప్లాన్ చేసుకున్నారట.

ఇప్పటికే ఈ వెకేషన్ కి సంబంధించిన బుకింగ్స్ అన్ని కూడా పూర్తి అయ్యాయని అందువల్లే తాను ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోవచ్చని తెలియజేశారు.

ఇక తమకు మాల్దీవ్స్ ( Males ) షెడ్యూల్ మార్చుకునే అవకాశం ఏమాత్రం ఉన్న తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరవుతానంటూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈనెల 28వ తేదీ ఖమ్మంలో ఏర్పాటు చేసే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా ఈయన పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్లో జరగబోయే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఎన్టీఆర్ హాజరవుతారో లేదా అన్నదాన్ని బట్టి ఈయన భవిష్యత్తులో రాజకీయాలలోకి వస్తారా రారా అనే విషయంపై స్పష్టత వస్తుందని పలువురు భావిస్తున్నారు.

మరి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఆ స్టార్ హీరోలకు ధీటుగా మోక్షజ్ఞ సక్సెస్ కావడం సాధ్యమేనా.. చరణ్ తర్వాత ఇతనేనంటూ?