జెడి కొత్త పార్టీ సమీకరణాలు మారుస్తుందా ?
TeluguStop.com
సిబిఐ జాయింట్ డైరెక్టర్గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకొని 2018 స్వచ్చంద పదవి విరమణ చేసిన లక్ష్మీనారాయణ ( Lakshminarayana )జనసేన పార్టీ తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసి దాదాపు 3 లక్షల పై చిలుకు ఓట్లను తెచ్చుకొని ఓటమి పాలయ్యారు, అయినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతుల మరియు విద్యార్థుల సంక్షేమం కోసం అనేక అవగాహన కార్యక్రమాలను చేస్తున్నారు.
నిజాయితీపరుడైన అధికారిగా ఆయనకు మంచి పేరు ఉంది.వివిధ కారణాలతో జనసేన( Janasena ) నుంచి బయటకు వచ్చిన ఆయనా బి ఆర్ఎస్ ఆంధ్ర శాఖ లో చేరతారని ప్రచారం జరిగినా అది కార్య రూపం దాల్చలేదు .
"""/" / అప్పటి నుంచి జెడి( JD ) అనేక పార్టీ లలో చేరబోతున్నారని అనేక లీకులు వినిపించిన కూడా చివరకు ఆయన ఇండిపెండెంట్గా పోటీ దిగుతారని అందరూ భావించారు.
అయితే అనూహ్యం గా ఆయన కొత్త పార్టీ పెట్టబోతునట్టుగా ప్రకటించడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచింది.
అయితే ఎన్నికలు దగ్గరలో వచ్చిన ప్రస్తుత సమయంలో ఆయన కొత్త పార్టీ పెడతానని ప్రకటించడం రాజకీయ సమీకరణాలు మారుస్తుందా అన్న విశ్లేషనలు వినిపిస్తున్నాయి .
ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలలో ఆయన చీల్చు తారనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
"""/" / ముఖ్యంగా ఆయనకు యువతలోనూ రైతుల లోనూ కొంతమంచి పేరు ఉందని, రాష్ట్ర మొత్తం పోటీ చేయకపోయినా కొన్ని ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో ఆయన పోటీకి అభ్యర్థులు నిలబడతారని ప్రచారం జరుగుతుంది.
తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పొత్తు గా ఏర్పాటు అయిన తెలుగుదేశం జనసేనకులకు జేడి పార్టీ వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా ఆయన తిరిగి జగన్ పార్టీ కే సహాయపడే అవకాశం ఉందని, ఈ పార్టీ వెనక వైసీపీ ఉందని కూడా కొంతమంది అంటున్నారు ఒకప్పుడు జగన్ కేసుల ద్వారానే ఫేమస్ అయిన జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు తన చర్యల ద్వారా జగన్కు మంచి చేసే ప్రయత్నం చేస్తున్నారా అని పలువురు చర్చించుకుంటున్నారు.
అల్లు అర్జున్ తో డాన్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను.. రష్మిక సంచలన వ్యాఖ్యలు!