ఆ ఇద్దరు నేతలు క్లారిటీతో ఉన్నారా ?

టి కాంగ్రెస్( T Congress ) ప్రస్తుతం యమ దూకుడుగా ఎన్నికలకు సిద్దమౌతున్నప్పటికి ఆ ఇద్దరి నేతల విషయంలో గత కొన్నాళ్లుగా సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది.

ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు.జగ్గారెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ వీడే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ రకమైన వార్తలు రావడానికి కూడా కారణం లేకపోలేదు.గతంలో పార్టీ కార్యకలాపాలలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ ఇద్దరు.

గత కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు అంటిఅంతనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. """/" / దీంతో ఈ ఇద్దరు కాంగ్రెస్ కు టాటా చెబుతారని భావించారంతా.

ఇక తాజాగా ఈ ఇద్దరు నేతల పార్టీ మార్పుపై మరోసారి క్లారిటీ వచ్చింది.

తాను పార్టీ మారడం లేదని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున హుజూర్ నగర్ నుంచి తాను పోటీ చేస్తానని అలాగే తన భార్య పద్మావతి రెడ్డి( Padmavati Reddy ) కోదాడ నుంచి పోటీ చేయబోతుందని స్పష్టం చేశారు.

దీంతో ఆయన పార్టీ మారడం లేదని తేలిపోయింది.ఇక జగ్గారెడ్డి( Jaggareddy ) విషయంలో ఈ రకమైన వార్తలు మరి ఎక్కువయ్యాయి.

ఆయన బి‌ఆర్‌ఎస్ గూటికి చేరబోతున్నారని కే‌సి‌ఆర్( KCR ) ప్రకటించే అభ్యర్థుల మొదటి జాబితాలో జగ్గారెడ్డి పేరు కూడా ఉండే అవకాశం ఉందనే పుకార్లు గుప్పుమంటున్నాయి.

తాజాగా ఇలాంటి వార్తలపై జగ్గారెడ్డి స్పందిస్తూ.తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తను ఎలాంటి పార్టీ మారడం లేదని కాంగ్రెస్ లోనే కొనసాగానున్నాట్లు స్పష్టం చేశారు.

"""/" / అయితే తనపై ఇలాంటి ప్రచారం కాంగ్రెస్ లోని ఓ వర్గం చేస్తోందని ఇలాంటి సంస్కృతి గతంలో తెలుగుదేశం పార్టీలో( TDP ) ఉండేదని ఇప్పుడు కాంగ్రెస్ కు పాకిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మొత్తానికి పార్టీ మార్పుపై జగ్గారెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) ఇద్దరు కూడా స్పష్టమైన క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.

మరి ఆ లిస్ట్ లో ఈ ఇద్దరి పేర్లు ఉంటాయా లేదా అనేది చూడాలి.

ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేయగా జగ్గారెడ్డి మాత్రం తను పోటీ స్థానంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

మరి ఎన్నికల ముందు ఈ ఇద్దరి చుట్టూ ఇంకెలాంటి రాజకీయ వేడి రాజుకుంటుందో చూడాలి.

పెళ్లి కూతురు ముందే వరుడి చెవిలో గుసగుసలాడిన ఫ్రెండ్.. చివరకు?