అమిత్ షా తో జగన్ భేటీ టిడిపికి కొత్త సమస్యలు తెస్తుందా?
TeluguStop.com
ఇప్పటికే న్యాయస్థానాల్లో ఊరట దక్కక తెలుగుదేశం( Telugudesam ) అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటుంది.
ముఖ్యంగా చంద్రబాబు( Chandrababu ) అరెస్టు తర్వాత ఆశించిన మైలేజ్ కొన్ని వర్గాల నుంచి దక్కినప్పటికీ న్యాయస్థానాలలో మాత్రం అనుకున్న దానికంటే వేగంగా పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోవడం ముఖ్యంగా బెయిల్ విషయంలో కానీ క్వాష్ పిటిషన్ విషయంలో కానీ సిబిఐ కోర్టు నుంచి హైకోర్టు వరకు ఎక్కడ అనుకూల తీర్పు రాకపోవడం సుప్రీంకోర్టులో కూడా విచారణ వాయిదా పడటం వంటి విషయాలు తెలుగు తమ్ముళ్లలో అంతులేని అసహనాన్ని కలిగిస్తున్నాయి .
మరోపక్క బాబు అరెస్టుపై ఇప్పటివరకు కేంద్ర పెద్దలను కలవని జగన్ ఇప్పుడు తాజాగా హోం మంత్రి అమిత్ షా( Home Minister Amit Shah ) తో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీని( Prime Minister Modi ) కూడా కలవనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
దాంతో చంద్రబాబు కేసులలో మరింత వేగంగా కదలిక ఉంటుందని, రాష్ట్ర విచారణ సంస్థలతోపాటు కేంద్ర విచారణ సంస్థలు కూడా బాబు కేసులలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందంటూ కొంతమంది అంచనా వేస్తున్నారు.
"""/" / చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్ర పెద్దల వ్యవహార శైలి చూసిన తర్వాత వారు జగన్ కి పరోక్ష మద్దతు ఇస్తున్నట్లుగా స్పష్టమైపోయిందని ఇప్పుడు ఈ భేటీల తర్వాత మరింత కొత్త ఇబ్బందులు తెలుగుదేశం ఎదుర్కొనే అవకాశం ఉందంటూ కూడా ఈ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే విషయం తెగే వరకూ వచ్చింది కాబట్టి తెలుగుదేశం కూడా కేంద్ర విధానాల విషయంలో రెండవ ఆలోచన కూడా చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ ఎన్డీఏ కూటమి తన వైపు ఆసక్తి చూపించకపోతే ఇండియాకూటమి తో కలిసి వెళ్లయినా సరే తాము జాతీయ రాజకీయాల్లో కూడా ఉనికి చాటుకోవాలన్న ప్రయత్నం తెలుగుదేశం వ్యూహకర్తలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఎన్నికల సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పటివరకు పరోక్ష మద్దతులతో పనికానిచ్చిన పార్టీలు ఇప్పుడు తమ అసలు స్వరూప స్వభావాలను బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు.
ఒత్తిడిని చిత్తు చేసే ఆవు నెయ్యి.. ఎలా తీసుకోవాలో తెలుసా?