వాలెంటర్లతో జగన్ కు నష్టమే ?

ఏపీలో వాలెంటరీ వ్యవస్థను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి( CM Jagan ) గత ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మొదట వాలెంటరీ వ్యవస్థపైనే దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేశారు.

ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా వాలెంటరీ వ్యవస్థ విధులను నిర్వర్తిస్తుందని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వాలెంటరీ వ్యవస్థ ప్రధాన పాత్ర వహిస్తుందని చెబుతూవచ్చారు.

అలాగే చేస్తున్నారు కూడా.అయితే వాలెంటరీ వ్యవస్థపై మొదటి నుంచి కూడా విమర్శలు వ్యక్తమౌతూనే ఉన్నాయి.

వాలెంటర్లు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని, వైసీపీ( YCP )కి మద్దతు తెలిపే కుటుంబాలకు మాత్రమే పథకాలు అందేలా వ్యవహరిస్తున్నారని ఈ రకమైన విమర్శలు వ్యక్తమౌతువచ్చాయి.

"""/" / ఇక ఈ మద్యకాలంలో వాలెంటరీ వ్యవస్థ విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయంగా మారడంతో పాటు ప్రజలను కూడా సందిగ్ధంలో పడేస్తున్నాయి.

వాలెంటర్లు ప్రజల డేటాను చోరీ చేస్తున్నారని, వ్యక్తిగత డేటా సేకరించే అధికారం వాలెంటర్లకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ వస్తున్నారు.

ప్రజల నుంచి సేకరించిన వ్యక్తిగత డేటాను అమ్మేస్తున్నారని.ఇది ముమ్మాటికి తప్పేనని వాలెంటర్లు రాజ్యంగా వ్యతిరేకమని తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు.

పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో కూడా కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. """/" / దీంతో వాలెంటర్లపై ప్రజల్లో కొత్త అనుమానాలు తెరపైకి రావడంతో పాటు ప్రజల్లో కూడా ఆ వ్యవస్థపై విశ్వసనీయత కోల్పోతోంది.

ఇదిలా ఉంచితే వాలెంటర్లను ఎలక్షన్ స్ట్రాటజీలో భాగం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఎలక్షన్ కమిషన్ మాజీ సిఈఓ నిమ్మగడ్డ రమేశ్( Nimmagadda Ramesh ) ఆరోపిస్తున్నారు.

ఎన్నికల సమయంలో ప్రజా ధనాన్ని రాజకీయ లబ్ది వినియోగిస్తున్నారని, అందులో సచివాలయ వ్యవస్థను వాలెంటరీ వ్యవస్థను ఇన్వాల్వ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారాయన.

ఈ పరినమలన్నీ చూస్తుంటే ఎన్నికల సమయంలో వాలెంటర్ల వల్ల వైఎస్ జగన్ కు నష్టం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మరి వాలెంటర్ల విషయంలో వస్తున్న వ్యతిరేకతను అధిగమించేందుకు జగన్ ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తారో చూడాలి.

వారికి వైసీపీలోకి రీ ఎంట్రీ లేనట్టేనా ?