వాలంటీర్లకు కూడా జగన్ టిక్కెట్లు ఇస్తారా?
TeluguStop.com
ఏపీలో సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత సచివాలయ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు.
దీంతో మూడేళ్లుగా జగన్ ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలను వాలంటీర్లు ప్రతి ఇంటికీ తిరిగి అందజేస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే స్థానిక ఎమ్మెల్యేల కంటే వాలంటీర్లనే ప్రజలు ఆదరిస్తున్నారనే టాక్ కూడా నడుస్తోంది.
దీంతో ప్రస్తుత పరిణామాలను గమనించి వైసీపీ ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పరిస్థితి చూస్తుంటే వాలంటీర్లకు కూడా టిక్కెట్లు ఇచ్చేలా జగన్ కనిపిస్తున్నారని పలువురు నేతలు ఆందోళన పడుతున్నారు.
ప్రస్తుతం పలువురు ఎమ్మెల్యేలు తమకు ఇష్టం ఉన్నా, లేకున్నా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ప్రజల మధ్యకు వెళ్తున్నారు.అయితే పలువురు నేతలను ప్రజలు తికమక పెడుతున్నారు.
ఇటీవల డిప్యూటీ సీఎం నారాయణస్వామికి తన నియోజకవర్గంలోనే ప్రజల నుంచి దిమ్మదిరిగే సమాధానం వచ్చింది.
గంగాధర నెల్లూరులో ఆయన పర్యటిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రజలను ప్రశ్నించారు.
"""/"/
తమకు పథకాలు అందుతున్నాయని ప్రజలు సమాధానం చెప్పగా.అవన్నీ ఎవరు ఇస్తున్నారో తెలుసా అని మరోసారి నారాయణస్వామి ప్రజలను ప్రశ్నించారు.
దీనికి ప్రజలు ‘ఇంకెవరు.వాలంటీరే కదా’ అని సమాధానం ఇవ్వడంతో నారాయణస్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వాస్తవానికి వీటిని అందిస్తోంది వైసీపీ ప్రభుత్వం.ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్.
అటు లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది మాత్రం ఎమ్మెల్యేలు.కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను ప్రజలు మరిచిపోయారు.
నిత్యం తమ ఇంటికి తిరిగే వాలంటీర్లనే ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు.ఈ లెక్కన చూస్తే రేపటి రోజున వాలంటీర్లను జగన్ నియమించినా వాళ్లు గెలిచేలా ఉన్నారని పలువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
దీనికి కారణం ఎమ్మెల్యేలేనని.గత మూడేళ్లుగా నియోజకవర్గం వైపు చూడటమే మానేశారని పలువురు భావిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల కోసం నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్.. టేబుల్‌పై రూ.68 కోట్లు.. ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చట!