వలసలను ఆపడం కష్టమేనా ? జగన్ కు చిక్కులేనా ?

అధికార పార్టీగా ఒక వెలుగు వెలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress Party ) ఇప్పుడు ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక పోయింది.

ఏపీలో జరిగిన ఎన్నికల్లో టిడిపి , జనసేన,  బిజెపి కూటమి అధికారంలోకి రావడం , వైసిపి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదాను కోల్పోయింది.

ఇక ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి వైసీపీ నుంచి వలసలు జోరదుకున్నాయి .

పార్టీకి చెందిన కీలక నేతలు ఎంతోమంది ఇప్పటికే వివిధ పార్టీల్లో చేరిపోయారు .

మరి కొంతమంది సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు.  అధికారం లేకుండా ఈ ఐదేళ్లు వైసీపీలోనే ఉంటే ఆర్థికంగా,  రాజకీయంగా అన్ని విధాల నష్టపోతామనే అభిప్రాయంతో చాలామంది నేతలు పార్టీ మారేందుకు మొగ్గు చూపిస్తున్నారు.

  వీరిలో జగన్ కు( Jagan ) అత్యంత సన్నిహితులైన వారు,  నియోజకవర్గ స్థాయి నాయకులు ఎంతోమంది ఉన్నారు.

ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు , మాజీ ఎంపీలు , వివిధ కార్పొరేషన్లకు  చైర్మన్లు గా పనిచేసిన వారు ఎంతోమంది పార్టీ మారిపోయారు.

"""/" / కొందరు టిడిపిలోకి , మరికొంతమంది జనసేన,  బిజెపిలలోకి చేరేందుకు సిద్దమవుతున్నారు.

ఇక కార్పొరేటర్ స్థాయి నుంచి వలసలు మొదలయ్యాయి.మెదటగా మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకునేందుకు కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్న క్రమంలో,  ఎమ్మెల్యేలు , మున్సిపల్ కార్పొరేటర్ లను తమ పార్టీలో చేర్చుకునే విషయంపై ఫోకస్ చేయడంతో , చాలాచోట్ల మున్సిపాలిటీలు అధికార పార్టీ ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి.

ఎమ్మెల్యేలు చేసే ప్రలోభాలతో పాటు,  ఈ ఐదేళ్లు వైసిపి లోనే( YCP ) ఉంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని , నిధులు అందవని,  ఆధిపత్యం కొనసాగించేందుకు వీలుండదని , అలాగే నామినేటెడ్ పనులు చేసుకునే అవకాశం ఉండదని , ఇవన్నీ దక్కాలంటే ఖచ్చితంగా పార్టీ మారాల్సిందే అన్న అభిప్రాయానికి వచ్చిన కార్పొరేటర్లు , కౌన్సిలర్లు వైసిపికి రాజీనామా చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) ప్రాతినిధ్యం వహిస్తున్న  పుంగనూరు లో ఇప్పటికే మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీని వీడారు.

"""/" / తాజాగా విశాఖలో 20 మంది వరకు వైసిపి కార్పొరేటర్లు టిడిపి , జనసేన లో చేరిపోతున్నారు.

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్( Visakha Municipal Corporation ) త్వరలోనే కూటమి పార్టీల ఖాతాలోకి వెళ్లనున్నాయి.

అలాగే మేయర్లను , మునిసిపల్ చైర్మన్ లను దించి తమ వారిని పదవులలో కూర్చోబెట్టడమే లక్ష్యంగా కూటమి పార్టీలు వలసలను ప్రోత్సహిస్తున్నాయి.

ఇవన్నీ చూస్తే ముందు ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు,  కార్పొరేషన్ లు అధికార పార్టీ చేతుల్లోకి వెళ్ళనున్నాయనే విషయం అర్థమవుతుంది.

మరి కొద్ది నెలల్లో వైసీపీని ఖాళీ చేయించడమే లక్ష్యంగా కూటమి పార్టీలు వలసలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి.

టాలీవుడ్ లో ఇలాంటి ఒక అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ ని ఇన్నేళ్లకు గుర్తించారా ?