జై ఎన్టీఆర్ అనడమే తప్పు అయిపోతుందా..?

జై ఎన్టీఆర్ అనడమే తప్పు అయిపోతుందా?

జై ఎన్టీఆర్ అనడమే తప్పు అయిపోతుందా.అంటే అవుననే అనిపిస్తుంది.

జై ఎన్టీఆర్ అనడమే తప్పు అయిపోతుందా?

ఖండాంతరాలు దాటినా టీడీపీ క్యాడర్ బుద్ధి పోలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దీనికి కారణం లేకపోలేదు.

జై ఎన్టీఆర్ అనడమే తప్పు అయిపోతుందా?

టీడీపీకి నందమూరి అభిమానుల సపోర్ట్ కావాలి.వారి ఇమేజీ పార్టీకి కావాలి కానీ నందమూరి ఉనికి మాత్రం పార్టీలో ఉండకూడదా.

అలానే అనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు.ఈ క్రమంలో జై ఎన్టీఆర్ అనడమే తప్పు అయిపోయింది.

ఆ మాట అన్నందుకు సాక్షాత్తు టీడీపీ శ్రేణులో దాడికి పాల్పడ్డారని సమాచారం.ఒక్కసారి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందని నారా లోకేశ్ మాత్రమే టీడీపీకి సారథ్యం వహించాలి.

ఆయన నినాదాలే వినిపించాలి.ఫ్లెక్సీల్లోనూ ఆయన పేరే కనిపించాలి.

వేరు వారి పేరు వినిపిస్తే అటు నుంచి దాడి మొదలు అయినట్లే.బుడ్డోడు.

చిన్న ఎన్టీఆర్ అంటే టీడీపీ ముఖ్యంగా లోకేశ్, చంద్రబాబుల అభిమానులు రగిలిపోతున్నారు.టీడీపీ సభల్లో, సమావేశాల్లో ఎక్కడైనా నందమూరి హరికృష్ణ.

, జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తే శివాలెత్తిపోవడం చాలా సార్లు చూశాం.ఆఖరకు ఆ జలస్, అసూయ ఇప్పుడు అమెరికా వెళ్లినా పోలేదు.

ప్రస్తుతం అమెరికాలో ఫిలడెల్ఫీయాలో తానా సభలు జరుగుతున్నాయి.దీనికి పలువురు టీడీపీ అభిమానులు ఆంధ్రానుంచి వెళ్లగా.

అమెరికాలో ఉండే టీడీపీ కార్యకర్తలతో పాటు చంద్రబాబు అభిమానులు సైతం హాజరయ్యారు.అయితే ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు జై ఎన్టీఆర్ అని నినదించడంతో లోకేష్, చంద్రబాబుల అభిమానులు ఆయనమీద దాడిచేసి కొట్టారని తెలుస్తోంది.

టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలో అక్కడి యువత రెండు వర్గాలుగా విడిపోవడంతో వివాదం చెలరేగింది.

దీంతో ఒకరి మీద ఒకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు.తరణి పరుచూరి, సతీష్ వేమన వర్గాలు ఈ గొడవలో వేర్వేరుగా తలపడి తన్నుకున్నారని తెలుస్తోంది.

ఈ సభ టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు, పార్టీకి హైప్ తేవడానికి ఏర్పాటు చేసినందున ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు ? ఆయనకు తెలుగుదేశానికి ఏం సంబంధం అంటూ లోకేష్ అభిమానులు ఆ కుర్రాడి మీదపడి కొట్టినట్లు తెలుస్తోంది.

అసలు తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ఆనవాళ్లు, ఉనికి అవసరం లేదని, ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీడీపీ భావిస్తోంది.

అందుకే వీలైనప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ ను, ఆయన అభిమానులను సైతం అవమానించడానికి చంద్రబాబు సైతం ఏ మాత్రం సంకోచించడం లేదు.

ఆమధ్య గుడివాడలో చంద్రబాబు సభలో కొందరు అభిమానులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ప్రదర్శించి జోహార్ హరికృష్ణ అని నినదించినందుకు వారిమీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఎన్టీఆర్ శత జయంతి సభ విజయవాడలో నిర్వహించినా జూనియర్ కు పిలుపు రాలేదు.

మొత్తానికి అయన ఉనికి అవసరం లేదనుకున్నారో.ఉంటే ప్రమాదం అనుకున్నారో తెలియదు కానీ జూనియర్ అనే సౌండ్ వినిపిస్తే చాలు చంద్రబాబు .

లోకేష్ అభిమానులు రౌండప్ చేసి కొట్టేస్తున్నారనే వాదనలు జోరుగా కొనసాగుతున్నాయి.దీంతో నందమూరి అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

మెగా మేనల్లుడు సాయి తేజ్ కి షాక్ ఇచ్చిన పోలీసులు… నోటీసులు జారీ!