2023లోనైనా భారత్‌ సత్తాచాటుతుందా? టీమిండియా పూర్తి షెడ్యూల్‌!

కొత్త సంవత్సరంలోకి విజయవంతంగా అడుగుపెట్టేసాం.గంపెడంత ఆశలతో ప్రపంచ క్రికెట్ వేదికపై దుమ్ముదులిపేందుకు టీమిండియా సిద్ధమైంది.

గత తేడాది చేసిన తప్పులన్నీ ఈ ఏడాది సరిదిద్దుకోనుంది.వన్డే ప్రపంచకప్‌ ఈ ఏడాది భారత్‌లోనే జరగనుందనే విషయం తెలిసినదే.

కాగా టీమిండియా దృష్టంతా ఈ మెగా టోర్నీపైనే ఉంది.ఎన్ని అడ్డంకులు ఎదురైనా స్వదేశంలో ప్రపంచకప్‌ను గెలిచి తీరాలనే కసితో భారత జట్టు కసరత్తులు చేస్తోంది.

ఈ ఏడాది రెండు పెద్ద టోర్నీల్లో విఫలమైన టీమిండియా, ఆసియా కప్-2022లో కూడా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంటోంది.

అలాగే ICC T20 ప్రపంచ కప్‌లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది.కాగా 2011లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను భారత్ చివరిగా గెలుచుకుందనే విషయం విదితమే.

ఈ సంవత్సరం శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో టీమిండియా ఆడాల్సి ఉంది.టీమిండియా మొదట శ్రీలంకతో తలపడనుంది.

ఈ సిరీస్‌లో శ్రీలంకతో భారత్‌ మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది.

"""/"/ T20 షెడ్యూల్‌ ఒకసారి పరిశీలిస్తే.1వ T20 (జనవరి 3, వాంఖడే స్టేడియం, ముంబై,) 2వ T20 (జనవరి 5, MCA స్టేడియం, ముంబై) 3వ T20 (జనవరి 7, SCA స్టేడియం, రాజ్‌కోట్)న జరగనుంది.

ఇక వన్డే సిరీస్‌ షెడ్యూల్‌ విషయానికొస్తే 1వ ODI (జనవరి 10, బర్సపరా స్టేడియం, గౌహతి) 2వ ODI (జనవరి 12, ఈడెన్ గార్డెన్స్ స్టేడియం, కోల్‌కతా) 3వ ODI (జనవరి 15, గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం)న జరగనుంది.

న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా విషయానికొస్తే.1st వన్డే (జనవరి 18, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్) 2వ వన్డే (జనవరి 21, షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాయ్‌పూర్) 3వ వన్డే (జనవరి 24, హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్) జరగనుంది.

నాగార్జున లోని నటుడిని బయటికి తీసిన సినిమా ఏంటో తెలుసా..?