మెగాస్టార్ విశ్వంభరలో హనుమంతుడు.. హనుమాన్ మ్యాజిక్ రిపీట్ కానుందా?

ఈ మధ్య కాలంలో మైథలాజికల్ సినిమాలు ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మైథలాజికల్ సినిమాలకు ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు.మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా( Vishwambhara )పై భారీ అంచనాలు నెలకొనగా మెగాస్టార్ విశ్వంభరలో హనుమంతుడు పాత్ర ఉంటుందని హనుమాన్ సినిమాలా ఈ సినిమాలో కూడా ప్లాన్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

"""/" / విశ్వంభర సినిమాతో హనుమాన్ మ్యాజిక్ రిపీట్ కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్ హిట్ గా నిలిస్తే 2025 సంక్రాంతికి విశ్వంభర హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో హనుమంతుని సన్నివేశాలు ఉన్న సినిమాలు అభిమానులకు సైతం గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

విశ్వంభర సినిమాకు మల్లిడి వశిష్ట( Mallidi Vassishta ) దర్శకుడు అనే సంగతి తెలిసిందే.

"""/" / విశ్వంభర సినిమా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మెగాస్టార్ విశ్వంభరలో హనుమంతుడి విగ్రహం ఉన్నట్టు ఇప్పటికే కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయనే సంగతి తెలిసిందే.

విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.స్టాలిన్ సినిమా విడుదలైన 18 సంవత్సరాల తర్వాత ఈ సినిమా విడుదల కానుండటం గమనార్హం.

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తోంది.విశ్వంభర ఒక భాగంగా మాత్రమే తెరకెక్కుతోందని భోగట్టా.

మల్లిడి వశిష్ట సెకండ్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.విశ్వంభర సినిమాపై చిరంజీవి చాలా ఆశలు పెట్టుకున్నారు.

భోళా శంకర్ విడుదలైన ఏడాదిన్నర తర్వాత రిలీజ్ కానున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

చిరంజీవి సంక్రాంతి విజేతగా నిలుస్తారో లేదో చూడాల్సి ఉంది.

డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది.. వర్షంలో డాన్స్ చేద్దాం అనుకుంటే చివరకి..?