గబ్బర్ సింగ్ రీ రిలీజ్ లో రికార్డు లను బ్రేక్ చేస్తుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతుంది.చిరంజీవి బర్త్ డే( Chiranjeevi Birthday ) సందర్భంగా ఆగస్టు 22వ తేదీన ఇంద్ర సినిమాని రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా రీ రిలీజ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతుందనే చెప్పాలి.

మరి ఇలాంటి సందర్భంలో చిరంజీవి లాంటి స్టార్ హీరో అప్పట్లో ఈ సినిమా మీద ఎలాంటి ఎఫర్ట్ పెట్టి నటించాడో మనందరికీ తెలిసిందే.

"""/" / ఇక ఈ సినిమాలో ముఖ్యంగా వీణ స్టెప్ అయితే హైలైట్ గా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇక ప్రస్తుతం సెప్టెంబర్ రెండోవ తేదీన పవన్ కళ్యాణ్ బర్త్ డే ( Pawan Kalyan Birthday)సందర్భంగా ఆయన చేసిన గబ్బర్ సింగ్ ( Gabbar Sing )సినిమాని కూడా రీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి మొత్తానికైతే గబ్బర్ సింగ్ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తుంది అంటూ ఇప్పటికే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలను పెట్టుకున్నారు.

పవన్ కళ్యాణ్ కి దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా భారీ సక్సెస్ ని అందించింది.

"""/" / ఇక రీ రిలీజ్ లో భారీ విజయాన్ని అందిస్తుందంటూ సినిమా మేకర్స్ అయితే భావిస్తున్నారు.

చూడాలి మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి రీ రిలీజ్ లో తన స్టార్ డమ్ ను కొనసాగిస్తాడా లేదా అనేది.

ఇంతకు ముందు ఖుషి సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన రీ రిలీజ్ లో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడు.

ఇక ఇప్పుడు ఈ సినిమాతో కూడా మరోసారి అలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.

నీరసాన్ని తరిమికొట్టే బెస్ట్ ఎనర్జీ బూస్టర్ లడ్డూ ఇది.. తప్పక డైట్ లో చేర్చుకోండి!