ఆ పార్టీతో దోస్తీ.. కేసీఆర్ ను గట్టెక్కిస్తుందా..?

తెలంగాణ రాజకీయాల్లో అపరచాణిక్యుడి గా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ( KCR ) ఈసారి ఘోర పరాజయం పాలయ్యారు.

ఆయన వేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి.చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవి చూసింది.

దాంతో సీఎం అయ్యే కేసీఆర్ కాస్త ఎమ్మెల్యేగా మారిపోయాడు.ఇక ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చాక కేసీఆర్ కాలుజారి పడటం ఆయనకు సర్జరీ చేయడం వంటివి జరిగాయి.

ఇక కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయి ఇన్ని రోజులైనా కూడా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు.

అయితే ఈ విషయంలో ఆయన గతంలో సీఎం అయ్యుండి వేరే వారి ముందు ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీలో ఎలా కూర్చోవాలి అనే నాముషీతోనే రావడం లేదని కొంతమంది అనుకుంటున్నారు.

"""/" / ఇక ఆయన ఆరోగ్యం కుదుటపడ్డాక కూడా అసెంబ్లీకి వచ్చే ఆలోచన లేదని తెలుస్తుంది.

ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.

ఎమ్మెల్యే అభ్యర్థి గా అసెంబ్లీలో ఉండడం కంటే మంత్రి అయి పార్లమెంట్లో కూర్చోవడం బెటర్ అనుకుంటున్నారో ఏమోగానీ ఆయన అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగుపెట్టడానికి ఆయన అహం అస్సలు ఒప్పుకోవట్లేదట.

అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ ( Congress ) పార్టీ మీద విజయం సాధించాలని ఎన్నో రకాల ఎత్తులు వేస్తున్నారు.

"""/" / ఇక ఈ నేపథ్యంలోనే ఆయన మళ్లీ బిజెపి ( BJP ) తో దోస్తీ కట్టాలని చూస్తున్నారట.

ఇక కాంగ్రెస్ ని ఎదుర్కోవాలంటే బిజెపితో ( BJP )కలిసిపోవడమే మంచిదని ఆయన భావిస్తున్నారట.

అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి బయటపడకుండా ఉండాలన్నా, గతంలో వారు చేసిన అవినీతులన్నీ బయటపడకుండా జాగ్రత్త పడాలన్నా కూడా వారికి పూర్తిగా బిజెపి సపోర్ట్ కావాలి.

ఎందుకంటే ఈసారి కూడా కేంద్రంలో బిజెపి వస్తుందని, మోడీ ( Modi ) నే పీఎం అవుతారని చాలా సర్వేలు చెబుతున్నాయి.

దీంతో మళ్లీ బిజెపితో కలిసిపోయి నడవాలని కేసీఆర్ భావిస్తున్నారట.ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా బిజెపితో కలిసిపోవడం కేసీఆర్ కి ప్లస్ అవుతున్న నేపథ్యంలో ఈయన మళ్ళీ మోడీతో దోస్తీ కట్టాలని చూస్తున్నారట.

రేపటితో ముగియనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్