రుణమాఫీపై తీపి కబురు అందేనా…?
TeluguStop.com
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా అమలు చేస్తున్న రూ.
2 లక్షల రైతు రుణమాఫీ దేశంలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా చేయడానికి సాహసం చేయలేదనే చెప్పాలి.
ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయాలంటే ప్రభుత్వంపై అధిక ఆర్ధిక భారం పడుతుంది.
అయినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.
అనుకున్న ప్రకారం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేసింది.
కానీ,అది పూర్తి స్థాయిలో అమలు చేయడంలో అనేక సాంకేతిక,బ్యాంకింగ్ పరమైన కారణాలు తలెత్తడంతో రాష్ట్రంలో ఇంకా అనేక మంది అన్నదాతలు తమ రుణాలు మాఫీ కాక బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతూనే ఉన్నారు.
ప్రభుత్వం కూడా కొందరికి సమస్య ఉన్నట్లు గుర్తించి,వారికి కూడా త్వరలోనే రుణమాఫీ చేస్తామని బలంగానే చెబుతుంది.
అయితే ఆ బలమైన మాటలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూపులు చూస్తున్న రైతాంగానికి భరోసా ఇచ్చేలా కనిపించడం లేదు.
దీనితో అసలు అవుతాయా లేక ఇక మా పని ఇంతేనా అనే సందిగ్ధంలో పడిపోయి ఎవరికీ చెప్పుకోలేక, భారాన్ని భరించలేక కుమిలిపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం నుండి రాష్ట్ర పార్టీ నాయకత్వం,ముఖ్యమంత్రి,మంత్రులు,ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు,ఎంపీలు చివరికి చోటా మోటా లీడర్ల వరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసి తీరుతామని చెబుతున్నారు.
అయినా మాఫీ కాకుండా ఆగిపోయిన రైతులకు మాత్రం ఎక్కడో ఏదో గుబులు పుట్టిస్తోంది.
సమయం గడిచే కొద్దీ కొందరు రైతులు నిరాశా నిస్పృహలకు లోనై సోషల్ మీడియా వేదికగా కొంతమంది రైతులకే రుణాలు మాఫీ చేశారని,మాఫీ కాని వారి పరిస్థితి ఏమిటని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దాఖలాలు లేకపోలేదు.
చెప్పడానికి గొప్పగా ఉన్నా చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని కాంగ్రెస్ కార్యకర్తలే బహిరంగంగా మాట్లాడే పరిస్థితి ఏర్పడింది.
దీనితో ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాన్ని ఆయుధంగా చేసుకుని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సందర్భం మనకు కనిపిస్తుంది.
వివిధ కారణాలతో ఆగిపోయిన రూ.2 లక్షల రుణమాఫీ ఎప్పటి వరకు మాఫీ చేస్తారనే దానిపై స్పష్టమైన సంకేతాలు కనుచూపు మేరలో కనిపించడం లేదనేది బాధిత రైతుల ఆందోళనగా చూడల్సి వస్తుంది.
రూ.2 లక్షల కంటే పైగా ఋణాలున్న రైతుల పరిస్థితి ఏంటి.
?
అసలుకే అండ లేక జారిపోతుంటే కొసరొచ్చి కొంగు ఇవ్వు పట్టుకుంటా అని ఏడుస్తున్నట్లుగా రూ.
2 లక్షల రుణమాఫీనే పూర్తి స్థాయిలో అమలుకాక కిందా మీదా అవుతుంటే రూ.
లక్షల పైగా ఉన్న రుణాలు సంగతి ఏంటనేది ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది.
పైగా దీనిపై ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.దీనితో ఆ రూ.
లక్షల పైన రుణాలు ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం రూ.
2లక్షల లోపు రుణాలున్న రైతులకే రుణమాఫీ చేసింది కదా అదే విధంగా మాకు కూడా రూ.
2 లక్షల వరకే మాఫీ చేస్తే ఆ పైన రుణాన్ని మేమే చెల్లించి బాకీ తీర్చుకుంటామని రైతులు చెప్తున్నప్పటికి ప్రస్తుతం వారి డిమాండ్ ను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదని చెప్పొచ్చు.
ప్రభుత్వం ఎన్నికలకు ముందు కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇపుడు ప్రభుత్వం చేస్తానన్న రూ.
2 లక్షలు మాఫీ చేస్తే,మంత్రులు ఒక్కక్కరు ఒక్కో విధంగా రుణమాఫీపై ప్రకటనలు చేయడం,రుణమాఫీ పూర్తి చేశామని చెప్పడంతో అంతా అయోమయం నెలకొంది.
రుణమాఫీ కాని రైతుల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించి,ప్రతీ రైతుకు సంపూర్ణ రుణమాఫీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా గుర్రంపోడు పిఏసిఎస్ చైర్మన్ చనమల్ల యాదవరెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అదే విధంగా అదే జిల్లా ఆమలూరు గ్రామానికి చెందిన మేకల యాదయ్య అనే రైతు తన ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.
నాకు మా కుటుంబంలో ఒక్కడికే క్రాప్ లోన్ ఉంది.రూ.
2 లక్షల రెండు వేలు లోన్ ఉంది.ప్రభుత్వం ఇప్పటివరకు 2లక్షల లోపే రుణమాఫీ చేసింది.
మాకు కూడా ప్రభుత్వం రుణమాఫీ చేసి ఆదుకోవాలని వేడు.ఇది ఒక్క యాదయ్య బాధ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది ఇలాంటి యాదయ్యలు దిగులుతో ఉన్నారు.
వచ్చే సంక్రాంతికి కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని రాజకీయ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది.
అంటే
రాజకీయ నాయకులకు అది తీపి కబురు లాంటిదే.అదే విధంగా అదే సంక్రాంతికి అన్నదాతలకు కూడా ప్రభుత్వం తీపి కబురు చెబుతుందా లేదా అనేది వేచి చూడక తప్పదు.
పుష్పరాజ్ లాంటి వ్యక్తులు బయట కూడా ఉన్నారు.. రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్!