Kodali Nani : అందరూ కలిసి యుద్ధం చేస్తారా.. పవన్ వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్
TeluguStop.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
పవన్ కల్యాణ్, చంద్రబాబు ఎక్కడ యుద్ధం చేస్తారని ప్రశ్నించారు.బీజేపీ ఎక్కడ యుద్ధం చేస్తుందన్న ఆయన అందరూ కలిసి యుద్ధం చేస్తారా అని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే ఎవరు ఎక్కడ యుద్ధానికి సిద్ధమో కనీసం వాళ్లకైనా క్లారిటీ ఉందా అని ప్రశ్నించారు.
"""/" / పవన్ కల్యాణ్, చంద్రబాబు ఎక్కడ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నారని నిలదీశారు.
బీజేపీ వీళ్లతో కలిసే యుద్ధం చేస్తుందా.? విడిగా యుద్ధం చేస్తుందా.
? అంటూ ప్రశ్నలు సంధించారు.టీడీపీ, జనసేన( TDP, Jana Sena )లో టికెట్లు ఆశించే వారికైనా తెలుసా అని అడిగారు.
ఈ క్రమంలోనే ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో ముందు క్లారిటీ తెచ్చుకోవాలని సూచించారు.
సీఎం జగన్( CM Jagan ) సిద్ధం పేరుతో దూసుకెళ్తున్నారన్న కొడాలి నాని మీరేమో యుద్ధం పేరుతో తమ ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడుతున్నారన్నారు.
అయితే తమ ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడుతంటే కామెడీగా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
ఫుట్‌బాల్ మ్యాచ్ లో రెఫరీ నిర్ణయంపై ఘర్షణ.. 100 మంది మృతి