వైరల్ అవుతోన్న పదేళ్ల నాటి వీడియో.. చిక్కుల్లో ఎలాన్ మస్క్, ట్రంప్ మెడకు చుట్టుకుంటుందా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు( Immigration Regulations ), అక్రమ వలసదారుల గురించి హాట్ డిస్కషన్ నడుస్తోంది.

ప్రస్తుతం దేశంలో అక్రమ వలసదారుల కారణంగా నేరాలు పెరుగుతుండటంతో పాటు సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది.

ఈ క్రమంలో వలసదారుల అంశం తాజా ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

దీనిని గుర్తించిన డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్( Kamala Harris ) మొన్నామధ్య సరిహద్దుల్లో పర్యటించి వచ్చారు.

"""/" / అధ్యక్ష ఎన్నికల్లో టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్( Billionaire Elon Musk ) పేరు కూడా మారుమోగుతోంది.

ఈయన తన మద్ధతును బాహాటంగానే రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌కు ప్రకటించారు.2023లో యూఎస్ - మెక్సికో సరిహద్దును సందర్శించినప్పటి నుంచి అక్రమ వలసదారులకు ఆయన గట్టి వ్యతిరేకిగా మారారు.

తనను తాను ప్రో ఇమ్మిగ్రెంట్‌గా ప్రకటించుకున్నప్పటికీ.దేశంలో ఎవరిని అనుమతించాలనే దానిపై పరిమితులు విధించాలని మస్క్ పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో 2013లో మస్క్ సోదరుడు కింబాల్ మస్క్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తిరిగి ప్రత్యక్షం కావడం దుమారం రేపుతోంది.

"""/" / 10 ఏళ్ల క్రితం మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో( Milken Institute Global Conference ) పాల్గొన్న కింబాల్( Kimball ).

తాము దక్షిణాఫ్రికా నుంచి కెనడాకు, తర్వాత అమెరికాకు వెళ్లిననప్పుడు ఎదుర్కొన్న కష్టాలను వివరించారు.

ఇదే ఇంటర్వ్యూలో కింబాల్ మస్క్.తమను తాము చట్టవిరుద్ధమైన వలసదారులుగా తెలిపాడు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 6 వారాల కంటే తక్కువ సమయం ఉండగా.ఎలాన్ మస్క్ వీడియో ఇప్పుడు దుమారం రేపుతోంది.

అది చూసిన నెటిజన్లు .తమ వ్యాపారానికి నిధులు సేకరించడం, అనుమతులు లేకుండా అమెరికాలో వ్యాపారం చేయడం చట్టప్రకారం నేరమని.

మస్క్‌ను దేశం నుంచి బహిష్కరించాలని కోరుతున్నారు.ఈ పరిణామాలు మస్క్ అండగా నిలిచిన రిపబ్లికన్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.

మరి ఈ వివాదానికి ఎలాన్ మస్క్ ఎలా ముగింపు పలుకుతాడో చూడాలి.

రాజమౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్ పిక్స్ లీక్ అయ్యాయా..?