టి కాంగ్రెస్ కు.. డీకే వల్ల లాభమేనా ?

కర్నాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ దృష్టంతా ఇప్పుడు తెలంగాణపై పడింది.కర్నాటకలో మాదిరి ఇక్కడ కూడా విజయం సాధించాలని గట్టి పట్టుదలగా ఉంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అనుసరిస్తున్న వ్యూహాలు అత్యంతా ఆసక్తిరేకెత్తిస్తున్నాయి.గత కొన్నాళ్లుగా టి కాంగ్రెస్ లో సీనియర్ నేతలకు మరియు రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గు భగ్గుమనెంతలా వివాదం కొనసాగుతోంది.

ప్రస్తుతం నిరువుగప్పిన నిప్పుల ఉన్న వివాదం ఎన్నికల సమయానికి మళ్ళీ రాజుకునే అవకాశం లేకపోలేదు.

అందుకే నేతల మద్య సక్యత పెంచేందుకు కొత్త ఎత్తుగడకు తెర తీసింది హస్తం అధిష్టానం.

"""/" / అదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా డీకే శివకుమార్( DK Shivakumar ) ను నియమించడం.

ఇంకా కన్ఫర్మ్ కాకపోయినప్పటికి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమమచారం.

మరి డీకే ను తెలంగాణకు తీసుకొస్తే పార్టీలోని అంతర్గత సమస్యలు తొలగుతయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిలుస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ), భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటివారితో డీకే శివకుమార్ కు మంచి సంబంధాలు ఉన్నాయి.

"""/" / అందువల్ల వారీనందరిని ఏకతాటిపైకి తీసుకువవడంతో డీకే సమర్థుడని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.

అందుకే డీకే శివకుమార్ కు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇలా చేస్తే రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రదాన్యతను తగ్గించినట్లేననేది కొందరి అభిప్రాయం.

అయితే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పాత్రను ఉపయోగించుకుంటూనే కేవలం పార్టీ అంతర్గత విషయాలలో డీకే సేవలు వినియోగించుకునే ప్లాన్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ.

మరి కర్నాటకలో తన వ్యూహ చతురతతో హస్తం పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టిన డీకే శివకుమార్.

తెలంగాణలో ఎలాంటి ప్లాన్ లను సిద్దం చేస్తారో చూడాలి.

పాస్‌పోర్ట్ లేకుండా ఇండియాలోకి ఎంట్రీ.. బంగ్లా యూట్యూబర్‌ షాకింగ్ ఇన్ఫో..