వారాహి తో సంతోష్ జగర్లపూడి రేంజ్ మారునుందా..?

ప్రస్తుతం యంగ్ డైరెక్టర్లు వరుస సినిమాలు చేస్తూ వాళ్ళకంటూ ఒక స్టార్ డమ్ ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించడానికి సర్వం సిద్ధం చేసుకుంటూ మరి ముందుకు దూసుకు వస్తున్నారు.

ఇక అందులో భాగంగానే చాలామంది డైరెక్టర్లు సక్సెస్ సాధిస్తే మరి కొంత మంది ఫెయిల్యూర్ డైరెక్టర్లు గా మిగిలిపోతున్నారు.

కానీ కొంత మంది డైరెక్టర్లు మాత్రం ఇండస్ట్రీ లో వల్ల బ్రాండ్ ని నిరూపించుకోవడానికి సినిమాలు చేస్తున్నారు.

అలాంటి డైరెక్టరే సంతోష్ జగర్లపూడి.( Santhosh Jagarlapudi ) ఇక ఈయన డైరెక్షన్ లో వస్తున్న మహేంద్ర గిరి వారాహి సినిమా( Mahendragiri Varahi ) మాత్రం ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ ని క్రియేట్ చేస్తుంది.

ఒక చిన్న గ్లింమ్స్ తోనే ఆల్మోస్ట్ ప్రేక్షకులందరు ఈ సినిమా ఏదో ఒక వండర్ అయితే క్రియేట్ చేయబోతుంది అని అనుకుంటున్నారు.

సుమంత్( Sumanth ) హీరో గా సంతోష్ జగర్లపూడి చేస్తున్న ఈ వారాహి సినిమా వైవిధ్యమైన కథాంశంతో ఇంతవరకు తెలుగులో ఎవరు టచ్ చేయలేని ఒక పాయింట్ తో రాబోతున్నట్టుగా ఈ సినిమా గ్లింమ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది.

ఇక ఎప్పుడూ మంచి కథలను ఎంకరేజ్ చేసే సుమంత్ ఇంతకుముందు సుబ్రహ్మణ్యపురం లాంటి సినిమాతో తనకు అదిరిపోయే హిట్ ఇచ్చిన సంతోష్ జాగర్లపూడి తోనే మరోసారి మహేంద్ర గిరి వారాహి అనే సినిమాని తీయడం కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది.

ఇక ఇప్పుడు వారాహి తెలుగు సినిమాల్లో ఒక సరికొత్త ట్రెండ్ ని సృష్టించనున్నట్టు గా తెలుస్తుంది.

"""/" / ఇక ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్( Suspense Thriller ) బాట పడుతుంది ఎప్పుడైతే వీరూపాక్ష సినిమా( Virupaksha ) సక్సెస్ సాధించిందో ఇక తెలుగు లో అన్ని సినిమాలు అదే పాటర్న్ లో వస్తున్నాయి.

కానీ ఇప్పుడు మహేంద్ర గిరి వారాహి సినిమా చాలా సినిమాలకి బెంచ్ మార్క్ గా మారబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

దైవత్వంతో ముడిపడి ఉన్న కొన్ని సమస్యలకు ఈ సినిమాలో ప్రేక్షకులు ఆశ్చర్య పడేలా సమాధానం ఇవ్వడానికి డైరెక్టర్ సిద్దమయ్యాడు.

ఇక ఈ కథని సంతోష్ జాగర్లపూడి ఒక రెండు సంవత్సరాల పాటు కష్టపడి రాసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈజ్ తెర మీద చూపించే విధంగా ప్రయత్నం చేస్తూన్నాడు.

"""/" / ఇక డైరెక్టర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చిన్న చిన్న మన్యుర్ డీటెయిల్స్ ని కూడా వదిలి పెట్టకుండా సినిమా మీద పూర్తి ఫ్యాషన్ తో సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి కొద్దిరోజులపాటు ఈ సినిమా ఇంపాక్ట్ అతని మైండ్ లో ఉండెలా చాలా గొప్పగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ప్రశాంతం గా సాగుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అర్జున్ రెడ్డి సినిమా మేకింగ్ తో సందీప్ రెడ్డి వంగ ఎలాంటి అలజడి అయితే రేపాడో, ప్రస్తుతం డైరెక్టర్ సంతోష్ కూడా ఈ సినిమా మేకింగ్ తో గానీ, సక్సెస్ తో గానీ అలాంటి ఒక అలజడిని క్రియేట్ చెబుతున్నట్టు గా తెలుస్తుంది.

కురులకు అండగా కరివేపాకు.. ఇలా వాడితే మస్తు లాభాలు!