2014లో కృష్ణదాస్ ఓడిపోయినా 2019లో గెలిచి మంత్రి అయ్యారు.కాగా మొదటి నుంచి కృష్ణదాస్ వైసీపీని అంటిపెట్టుకుని ఉండడంతో సీనియర్‌గా ఉన్న ప్రసాదరావును కాదని కృష్ణదాస్‌కు మంత్రివర్గంలో చోటు ఇచ్చారు.
దీంతో ప్రసాదరావు అనుచర వర్గం ఖంగుతింది.2019 అభ్యర్థుల జాబితాను ఆయనతో విడుదల చేయించి గెలిచాక ఎందుకు పక్కన పెట్టారని టాక్ వచ్చింది.
శ్రీకాకుళం ఎంపీ సీటు విషయంలో ప్రసాదరావు సహకరించలేదని, అందుకే వైసీపీ ఓడిపోయిందని, తద్వారా మంత్రి పదవి మిస్ అయిందని టాక్.
ఇక వైసీపీ మూడేండ్ల పాలనలో ప్రసాదరావు కొన్నిసార్లు హాట్ కామెంట్స్ చేశారు. """/"/ సొత ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం విధితమే.
ఇక ఆయన వైసీపీలో ఇమడలేకపోతున్నారనే టాక్ కూడా వచ్చింది.తాజాగా అసెంబ్లీలో శాసనసభకు ఉన్న హక్కులు చట్టాలు చేసే అధికారాలు అన్న అంశంపై ప్రసాదరావు ఆకట్టుకునే స్పీచ్ ఇచ్చారు.
దీంతో ఆయనకు మంత్రి వర్గంలో బెర్త్ ఖాయమని అనుకున్నారు.ప్రస్తుత ప్రచారాన్ని చూస్తే మంత్రి పదవి కాదని, స్పీకర్ పదవి మాత్రమే ఇస్తారని తెలుస్తోంది.
ఇది పక్కన బెడితే ప్రసాదరావుకు మాత్రం మినిస్టర్ కావాలని ఆకాంక్ష.చవరి రెండేండ్లలో తానేంటే చూపించుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారట.
అయితే సిక్కోలులో ధర్మాన ఫ్యామిలీ మొత్తం నిలబడితే వైసీపీకి విజయం తథ్యం. """/"/
మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్న క్రిష్ణదాస్ తనకు పదవి పోతే తమ్ముడు ప్రసాదరావుకు ఇవ్వాలని కోరుతున్నారట.
మొత్తంగా మంత్రి గిరి ఐదేండ్లు ధర్మాన ఫ్యామిలీకే ఉంటుందని భావిస్తున్నారని సమాచారం.కానీ, జగన్ మాత్రం తమ్మినేని సీతారామ్‌పై దృష్టిపెట్టారట.
ఎందుకంటే ఆయన అచ్చన్నాయుడు పేరు వింటేనే రగిలిపోతారట.అందుకే శ్రీకాకుళంలో తమ్మినేనిని పెట్టి యుద్దం కొనసాగించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలసింది.
ఇక ప్రసాదరావు ఆశలు నెరవేరుతాయా ? లేవా ? అన్నది మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
విధిరాతను అధిగమించి పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థిని.. బాలయ్య చేసిన పనికి ఫిదా!