ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా దేవర నిలిచే ఛాన్స్ ఉందా.. సినిమాకు అదే సమస్య అంటూ?
TeluguStop.com
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) అభిమానులు దేవర మూవీ( Devara Movie ) టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని భావిస్తున్నారు.
ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచే అన్ని లక్షణాలు దేవర మూవీకి ఉన్నాయి.
దేవర సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
దేవర సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలు వ్యూస్ పరంగా అదుర్స్ అనిపించాయి.
"""/" /
దేవర సినిమా నుంచి తాజాగా వినాయక చవితి( Vinayaka Chavithi ) కానుకగా కొత్త పోస్టర్ విడుదల కాగా ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.
దేవర సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాకు 350 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది.
దేవర సినిమా జాన్వీ, సైఫ్ అలీ ఖాన్, కొరటాల శివ ఇలా ఎంతోమంది కెరీర్లను సైతం డిసైడ్ చేయనుంది.
"""/" /
ఈ మధ్య కాలంలో టీజర్ లేకుండా డైరెక్ట్ గా ట్రైలర్ విడుదలవుతున్న సినిమా కూడా ఇదే కావడం గమనార్హం.
జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఈ సినిమాలో తన గ్లామర్ తో అదరగొట్టిందని తెలుస్తోంది.
ముఖ్యంగా చుట్టమల్లే సాంగ్ ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరగడానికి కారణమని చెప్పవచ్చు.
చుట్టమల్లే సాంగ్ తెలుగు వెర్షన్ కు ఇప్పటికే ఏకంగా 107 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
రాబోయే రోజుల్లో సైతం యూట్యూబ్ లో ఈ సాంగ్ సంచలనాలు కొనసాగే అవకాశాలు అయితే ఉంటాయి.
దేవర సినిమా యాక్షన్ ప్రియులను మెప్పించే విధంగా ఉండనుందని తెలుస్తోంది.దేవర సినిమా ఇండస్ట్రీ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.
దేవర1 మూవీలో ట్విస్టులు సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది.ఇతర భాషల్లో ఇప్పటికీ భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడకపోవడం ఈ సినిమాకు మైనస్ అవుతోంది.
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo