నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ సత్తా చాటేనా?

తెలంగాణలో వరుస ఉప ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల మధ్య మాటల తూటాలతో రాజకీయ వేడి రాజుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాo.

దుబ్బాక ఉప ఎన్నిక తరువాత నాగార్జున సాగర్ ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్ రానుంది.

ఇప్పటికే ఆయా పార్టీలు వారివారి అభ్యర్థులను ఖరారు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.ఇప్పటికే వరుస ఎన్నికల్లో సత్తా చాటుతున్న బీజేపీ ఈ ఎన్నికలోనూ సత్తా చాటి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ కంకణం కట్టుకుంది.

ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల నర్సింహయ్య కుమారుడికి టికెట్ ఇస్తారా ఇవ్వరా అనే విషయం భవిష్యత్తులో తేలనుంది.

ఇక నాగార్జున సాగర్ అనేది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి కంచుకోట అని చెప్పవచ్చు.

కాని కేసీఆర్ చరిష్మాతో జానారెడ్డి ఓటమి పాలయ్యారు.కాని ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలో కావచ్చు, జీహెచ్ఎంసీ ఎన్నికలో కావచ్చు కాంగ్రెస్ ఛతికల పడ్డదనే చెప్పవచ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనమైన వాతావరణం ఉండడంతో పాటు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీని తట్టుకొని ఎన్నికల్లో సత్తా చాటితే కాంగ్రెస్ కు అది గొప్ప విజయమనే చెప్పవచ్చు.

కూటమి గెలిస్తే ఇంట్లో ఒక్కరికే పథకమా.. బాబు షాకింగ్ షరతులు అలా ఉండబోతున్నాయా?