చంద్రబాబు హామీలు గట్టెక్కిస్తాయా ?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం చంద్రబాబు( Chandrababu Naidu, ) చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు.

ఈసారి ఎన్నికలు టీడీపీకి అత్యంత కీలకం కావడంతో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారాయన.

ఇప్పటికే నియోజిక వర్గాల వారీగా పర్యటిస్తున్న చంద్రబాబు.జగన్ సర్కార్ పై విమర్శనస్త్రాలు ఎక్కుబేడుతూనే పార్టీకి మైలేజ్ తెచ్చే పనిలో బిజీగా ఉన్నారు.

ఇప్పటికే మినీ మేనిఫెస్టో ప్రకటించి అందరి కంటే ముందే ఎన్నికల బరిలో దుకారు.

ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తులు జరుపుతున్నారు. """/" / ఇదిలా ఉంచితే అధికారమే లక్ష్యంగా చంద్రబాబు ప్రకటిస్తున్న హామీలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, 20 లక్షల ఉద్యోగాలు.

ఇలా చాలా హామీలనే గుప్పించారు.అయితే చంద్రబాబు ఇచ్చిన హామీలు కర్నాటక ఎన్నికల్లో( Karnataka Elections ) కాంగ్రెస్ మేనిఫెస్టోను పోలి ఉన్నప్పటికి.

ఏపీలో చంద్రబాబు ప్రకటించిన ఈ మేనిఫెస్టోపై సానుకూలత ఎక్కువగానే కనిపిస్తోంది.ఇక తాజాగా మరో హామీని మరో హామీని ప్రకటించి మరింత పోలిటికల్ హీట్ పెంచారు చంద్రబాబు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే సోలార్ పవర్ తీసుకొచ్చి రెండు రూపాయలకే యూనిట్ కరెంట్ అధిస్తామని ప్రకటించారాయన.

దాంతో ఈ హామీ హాట్ టాపిక్ గా మారింది. """/" / ప్రస్తుతం జగన్( YS Jagan Mohan Reddy ) పాలనలో కరెంట్ చార్జీల మోత మొగుతున్న నేపథ్యంలో రెండు రూపాయలకే యూనిట్ కరెంట్ అని చంద్రబాబు ప్రకటించడం టీడీపీకి కలిసొచ్చే అంశం.

అయితే హామీలు ఎలాగున్న అధికారంలోకి వచ్చాక వాటిని చంద్రబాబు అట్టకెక్కిస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.

2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అప్పుడు చాలా హామీలనే ప్రకటించారు కానీ వాటిలో చాలావరకు కార్యరూపం దాల్చలేదు.

ఇటువైపు తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్లకే తొంబై శాతం హామీలను నెరవేర్చమని వైసీపీ ధీమాగా చెబుతోంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు హామీలను ప్రజలు ఎంతవరుకు నమ్ముతారనేది ప్రశ్నార్థకమే.మరి బాబు హామీలు ఎంతవరుకు గట్టెక్కిస్తాయో చూడాలి.

అదిరిపోయే స్పీచ్ ఇచ్చి అందరినీ నవ్వించిన చిన్నారి.. వీడియో వైరల్..